
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
చెన్నూర్‌రూరల్ ఆదిలాబాద్ : మండలంలోని ఒత్కులపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గొల్లవాగు ప్రాజెక్టు కాలువలో జారి పడి గురువారం జాడి రామ్‌చరణ్(11) మృతి చెందాడు. చెన్నూర్ పట్టణ సీఐ కిశోర్ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన జాడి సారయ్య, మల్లీశ్వరిల కుమారుడు రామ్‌చరణ్ మరో బాలుడితో కలిసి గొల్లవాగు కాలువ వైపునకు బహిర్భూమికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు రామ్‌చరణ్ జారి కాలువలో పడ్డాడు.
కాలువలో ఇటీవల కురిసిన వర్షపు నీరు నిలిచి ఉండటంతో మృతి చెందాడు. మరో బాలుడు కాలువ గట్టుపైనే ఉన్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాలువ వద్దకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామ్‌చరణ్ 6వ తరగతి చదువుతున్నాడు. బాలుని మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదించిన తీరు పలువుర్ని కంట తడి పెట్టించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment