
తెల్లారితే పెళ్లి, పిడుగుపడి వధువు మృతి
తెల్లారితే పెళ్లి. కోటి ఆశలతో పెళ్లికూతురు గోరింట పెట్టుకుంది. ఇంతలో హోరున గాలివాన.
వరంగల్ : తెల్లారితే పెళ్లి. కోటి ఆశలతో పెళ్లికూతురు గోరింట పెట్టుకుంది. ఇంతలో హోరున గాలివాన. దీంతో ఆమె పెళ్లి సామాగ్రిని జాగ్రత్తగా ఇంట్లో పెడతామని సర్దుతోంది. ఇంతలో హఠాత్తుగా పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం పూరితండాకు చెందిన ఉమకు సురేష్‌కుమార్‌తో ఈనెల 21న వివాహం జరగాల్సి ఉంది.
అయితే సంతోషంగా పెళ్లి మండపానికి వెళ్లాల్సిన వధువు .. కాటికి పయనమైంది. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.