రాజాపేట (ఆలేరు) : తపాసుపల్లి రిజర్వాయర్ ద్వారా మామాఅల్లుడు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు జలదోపిడీకి పాల్ప డుతున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. సోమవారం తపాసుపల్లి రిజార్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లాకు నీటిని తరలిస్తున్న కాల్వను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ, ఆలేరు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తపాసుపల్లి రిజర్వాయర్‌ను 2004లో ప్రారంభించి 2013 వరకు పూర్తిచేసిందని తెలిపారు.
రాజాపేట మండలంలోని పాలెంగండిలోకి తపాసుపల్లి రిజార్వాయర్ నీరు అందించేందుకు అప్పట్లో రూ.4.95కోట్లు నిధులు మంజూరు చేయించామన్నారు. నేటి ప్రభుత్వం ఆ ప్రణాళికను తుంగలో తొక్కిందన్నారు. తపాసుపల్లి ద్వారా ఆలేరుకు వచ్చే జలాలను మంత్రి హరీశ్‌రావు సొంత జిల్లా సిద్దిపేటకు తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఆలేరు ప్రాంత ప్రజలపై ప్రేమలేదని.. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరు మార్చుకుని రాజాపేట, ఆలేరు ప్రాంతాలకు తపాసుపల్లి నీరు అందిచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, జనగామ ఉపేందర్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోత్నక్ ప్రమాద్‌కుమార్, తుర్కపల్లి ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్, నాయకులు ఎంఎస్ విజయ్‌కుమార్, నీలం వెకంటస్వామి, భరత్‌గౌడ్, శంకర్‌నాయక్, నాగిర్తి రాజిరెడ్డి, సట్టు తిరుమలేష్, ఎడ్ల బాలలక్ష్మి, నీలం పద్మ, బుడిగె పెంటయ్యగౌడ్, గొల్లపల్లి రాంరెడ్డి, శంకర్‌గౌడ్, సాగర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, సుధాకర్, మల్లేష్‌యాద్, రాంరెడ్డి, విఠల్‌నాయక్, రాంజీ నాయక్, బాలయ్య, యాదేష్, రమేష్, ఇస్తారి, సిద్దులు, ప్రవీణ్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment