
కార్మికుల పొట్టకొట్టే వారికి టీఆర్‌ఎస్ వత్తాసు
► బిల్ట్ పరిశ్రమపై నోరెత్తని సర్కార్
► మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క
వరంగల్ : రాష్ట్రంలోని కార్మికుల పొట్టకొట్టే యాజమాన్యాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దనసరి అనసూయ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మేడే వేడుకల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు జెండాను అవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ తెలంగాణ వస్తేనే తమ బతుకు మారుతాయని భావించిన కార్మికులకు రెండు ఏళ్లు గడిచినా ఒరిగిందేమి లేదన్నారు.
టీ ఆర్‌ఎస్ ఎన్నికల్లో పార్ట్‌టైం ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీ నేటికీ అమలు కాలేదు. బిల్ట్ పరిశ్రమ మూతపడి రోడ్డున పడ్డా కార్మికుల కుటుంబాల పరిస్థితిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో టీఎన్‌టీయూసీ నాయకులు బాస్కుల ఈశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్, నాయకులు కొండం మధుసూదన్‌రెడ్డి, తాళ్లపల్లి జయపాల్, కుసుమ శ్యాం, మార్గం సారంగం, తదితరులు పాల్గొన్నారు.