సర్పంచ్ నుంచి మంత్రి వరకూ...
హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే చెర్లకోల. లక్ష్మారెడ్డి రేసులో ముందు నిలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయన మంగళవారం గవర్నర్ సమక్షంలో తెలంగాణ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సమీకరణల్లో భాగంగా తొలివిడత మంత్రివర్గంలో సి.లక్ష్మారెడ్డికి స్థానం దక్కలేదు. సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయనకు మంత్రి పదవి దక్కింది.
అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగడం, 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓటమిపాలు కావడం ...అలాగే ఇటీవల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందటం ఆయనకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. కాగా కరువు జిల్లా పాలమూరుపై కేసీఆర్ పదవుల వర్షం కురిపించటంతో లక్ష్మారెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది.
వ్యక్తిగత వివరాలు:
తల్లిదండ్రులు: లక్ష్మమ్మ, నారాయణరెడ్డి
పుట్టిన తేదీ: 03-02-1962
భార్యః శ్వేత
కూతురుః స్పూర్తి, కుమారుడు: స్వరణ్
స్వగ్రామం: అవంచ గ్రామం,
తిమ్మాజిపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
విద్యార్హత: బిహెచ్‌ఎంఎస్
రాజకీయ ప్రస్థానం :
1988: అవంచ గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక
1995: తిమ్మాజిపేట సింగిల్‌విండో అధ్యక్షులుగా ఎన్నిక
1996: జిల్లా గ్రంథాలయ అభివృధ్ది సంస్థ చైర్మన్‌గా నియామకం
1999: స్వతంత్య్ర అభ్యర్థిగా జడ్చర్ల నుంచి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు
2001: టిఆర్‌ఎస్‌లో చేరిక
2004-2008: జడ్చర్ల ఎమ్మెల్యేగా టిఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు
2008: ఎమ్మెల్యే పదవికి కెసిఆర్ పిలుపుతో రాజీనామా (రాజీనామా చేసిన మొదటి ఎమ్మెల్యే)
2014: తిరిగి టిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.