
విందు పేరుతో ప్రలోభాలు: ఎమ్మెల్యేపై కేసు నమోదు
మెదక్ జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్పై స్థానిక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ నందీశ్వర్ గౌడ్పై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే గత అర్థరాత్రి హోటల్లో ముస్లిం ఓటర్లకు సదరు ఎమ్మెల్యే విందు ఏర్పాటు చేశారు.
ఆ విందుకు భారీగా ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఆ విందుపై కొంత మంది యువకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హోటల్పై దాడి చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.