తూప్రాన్‌లోని కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం, బస్సు డ్రైవర్‌లపై ఐపీసీ సెక్షన్ 304ఎ, 337లతోపాటు రైల్వే చట్టంలోని 153, 161 సెక్షన్ల కింద నిజామాబాద్ రైల్వే పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీచంద్రశేఖరరెడ్డి
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద గురువారం ఉదయం రైలు, స్కూల్ బస్సు ను ఢీకొన్న ఘోర ప్రమాదంపై తూప్రాన్‌లోని కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం, బస్సు డ్రైవర్‌లపై ఐపీసీ సెక్షన్ 304ఎ, 337లతోపాటు రైల్వే చట్టంలోని 153, 161 సెక్షన్ల కింద నిజామాబాద్ రైల్వే పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి, వారి తల్లి దండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ కూడా ఘటనా స్థలంలోనే మరణించాడని, దీంతో కాకతీయ స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేస్తామని ఆయన అన్నారు.