కేసీఆర్ కూడా భయపడుతున్నారా? | Celebrate September 17 as Telangana Liberation Day, demands CPI Narayana | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కూడా భయపడుతున్నారా?

Aug 5 2014 12:16 PM | Updated on Apr 7 2019 4:32 PM

కేసీఆర్ కూడా భయపడుతున్నారా? - Sakshi

కేసీఆర్ కూడా భయపడుతున్నారా?

తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి గుర్తింపు రాకపోవటం బాధాకరమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి గుర్తింపు రాకపోవటం బాధాకరమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ  సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కూడా మతోన్మాదులకు భయపడుతున్నారని తెలుస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు.

మెదక్లో కరెంట్ అడిగిన రైతులపై లాఠీఛార్జ్ చేయటం దారుణమన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలని నారాయణ డిమాండ్ చేశారు. ఆగస్ట్ 10,11 తేదీల్లో చండ్ర రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని, ఉత్సవాల సందర్భంగా బహిరంగ సభతో పాటు రెడ్షర్ట్  కవాతు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement