తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు సంబరాలు జరుపుకున్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అహ్మద్‌బాబు జాతీయ జెండా ఎగురవేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ముఖ్య నేతలు, ఉద్యమ వీరులు, పర్యాటక ప్రాంతాలు, ప్రాజెక్టులు, గిరిజన గుస్సాడీ నృత్యాలు తదితర ఫొటోలతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం’ అనే స్వాగత తోరణాన్ని కలెక్టరేట్ మెయిన్ గేట్ ఎదుట ఏర్పాటు చేశారు.
అనంతరం ఉద్యోగులు, అధికారులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. కలెక్టరేట్ ఎదుట టపాసులు పేల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో (చైర్మన్) జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు జాతీయ జెండా ఎగురవేశారు. సహకార శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగులు కార్యాలయం ఆవరణలో టపాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్య ప్రణాళిక శాఖ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీవో షేక్ మీరా కేక్ కట్ చేశారు.
అనంతరం ఆవరణలో టపాసులు పేల్చారు. సంబరాల్లో కలెక్టరేట్ ఉద్యోగులు ఏవో సంజయ్‌కుమార్, ప్రభాకర్‌స్వామి, రాజేశ్వర్, రాజేందర్, సంతో ష్, మహేశ్, జిల్లా పరిషత్ ఉద్యోగులు గజానన్‌రావు, శ్రీనివాస్, సలీం, సమద్, సత్యం, లక్ష్మీకాంతం, సహకార శాఖ ఉద్యోగులు హారతి, సుజాత, సునీత, లక్ష్మి, మనోహర్, రామ్‌లాల్, టీఎన్జీవోస్ తాలుకా అధ్యక్షుడు నవీన్‌కుమార్, సహకార ఉద్యోగుల సంఘం కార్యదర్శి మోయిజ్ అలీ, ఉపాధ్యక్షుడు శంకర్, టీజీవో అసోసియే ట్ అధ్యక్షుడు గుణవంత్‌రావు, సహకార శాఖ సిబ్బంది, సీపీవో కార్యాలయ ఉద్యోగులు అసిస్టెంట్ డెరైక్టర్లు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, బీకే రాజు, సుదర్శన్‌రెడ్డి, డెప్యూటీ ఎస్‌వోలు రవీందర్, అంజయ్య, సత్యానందం, ఉద్యోగులు ఉమారాణి, నిర్మల పాల్గొన్నారు.