
సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి రాష్ట్రాలకు సహాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు, జానపద కళాకారులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తర్వాత పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం కష్టకాలంలోనూ పేదలను ఆదుకోవడం లేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయం చేయడంలో ఆంక్షలు విధిస్తున్నదని ఆరోపించారు. అప్పులు తీసుకోవడానికి పలు రకాల షరతులు విధించడం సరికాదన్నారు.
ఈ కష్టకాలంలో షరతులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేంద్రం పేదలకు కేవలం 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్న దని దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థలో మా ర్పు రావాల్సిన అవసరం ఉందని ఆయ న అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్ సమ యం లో ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం, రూ.1,500 ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.2,500 కోట్లను రెండు దఫాలుగా పంపిణీ చేశామన్నారు. వైజాగ్ గ్యాస్ లీకేజీ లాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పరిశ్రమల యాజమాన్యాలు, సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు 24 గంట ల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment