ఎయిర్‌పోర్టు వస్తోంది
జక్రాన్‌పల్లి:జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ప్రజల కల నెరవేరబోతోంది. దేశంలో 51, రాష్ట్రంలో 8 ప్రాంతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని గత ఏడాది జూన్ 29న ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించింది. కానీ, ఈ విషయాన్ని బడ్జెట్ లో ప్రస్తావించలేదు. తాజాగా ఎన్‌డీఏ సర్కారు ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల స్థాపనకు బడ్జెట్‌లో సుముఖత వ్యక్తం చేయడంతో మళ్లీ జిల్లాలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన తె రపైకి వచ్చింది.
జక్రాన్‌పల్లి మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గ తంలో భావించారు. ఇందుకోసం 795.36 ఎకరాల పట్టా భూములను, 1,208.26 ఎకరాల అసైన్డ్ భూములను అప్పగించడానికి జక్రాన్‌పల్లి మండల రైతులు ముందు కు వచ్చారు. అయితే, ఎయిర్ ట్రాఫిక్ పెరి గి వైమానిక కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని, 2009లో రక్షణ శాఖ అ భ్యంతరం వ్యక్తం చేసింది. కరీంనగర్‌తోపా టు జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పా టు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల ని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఈ అంశం తాత్కాలికంగా మరుగునపడిం ది. పీఎంఓ నిర్ణయంతో మళ్లీ తెరపైకి వచ్చింది.
యూనివర్సిటీ శంకుస్థాపన సమయంలోనే వైఎస్ హామీ
డిచ్‌పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ శం కుస్థాపనకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జక్రాన్‌పల్లి మండలంలోనే ఎ యిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎయిర్‌పోర్టు స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు. ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో జిల్లాకో ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సంకల్పించిన దివంగత ముఖ్యమంత్రి కల నెరవేరబోతోంది.
అప్పట్లో వైఎస్ ఆలోచనకు అనుగుణంగా జక్రాన్‌పల్లి జక్రాన్‌పల్లి, కొలిప్యాక్, తొర్లికొం డ, మనోహరాబాద్ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా ఎంతో విశాలమైన స్థలం ఇక్కడే ఉంది. దీంతో నాలుగు గ్రామాల పరిధిలోని 2004.22 ఎకరాల భూమిని సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
గ్రామాల రూపురేఖలు మారుతాయి
విమానాశ్రయం ఏర్పాటయితే జిల్లాతోపాటు చుట్టూ ఉన్న గ్రామాల రూపు రేఖలు మారిపోయి అభివృద్ధి బాట పడతాయని ఆశించిన రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. నష్ట పరిహారం విషయంలో స్వల్ప వివాదం ఏర్పడినా, రైతులంతా విమానాశ్రయం ఏర్పాటుకే సుముఖత వ్యక్తం చేశారు. విమానాశ్రయం ప్రతి పాదిస్తున్న స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉంది. తెలంగాణ యూనివర్సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రైతులు ఆశిస్తున్నారు.
ఉత్తర తెలంగాణలోనే జిల్లావాసులు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. వీరితోపాటు సీడ్ వ్యాపారం ఇక్కడ అభివృద్ధి చెందింది. వీరందరికీ విమానాశ్రయం ఎంతగానో ఉపయోగపడుతుంది.