ఎవరిని అడిగి రద్దు చేశారు మంత్రి హరీశ్‌పై చాడ ధ్వజం
నాగర్‌కర్నూల్: తోటపల్లి రిజర్వాయర్‌కు సీపీఐ వ్యతిరేకమంటూ మంత్రి హరీశ్‌రావు వక్రీకరిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం నాగర్‌కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై ప్రభుత్వం తొండాట ఆడుతోందని విమర్శించారు. 1600 ఎకరాల భూమిని సేకరించిన అనంతరం ఇప్పుడు రిజర్వాయర్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అసలు ఎవరితో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు తమ నియోజకవర్గాలకు నీళ్లు తీసుకెళ్లేందుకే రద్దు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
గతంలో తోటపల్లి రిజర్వాయర్ కంటే సింగరాయ్‌కొండ ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు తగ్గుతుందన్న అక్కడి ప్రజల నిర్ణయాన్ని అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తీసుకెళ్లామని, ఆ అవకాశాలు లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించుకుందని చెప్పారు. ఈ విషయంలో రైతులతో మాట్లాడి భూసేకరణకు సీపీఐ రైతులను ఒప్పించిందన్నారు. కానీ మంత్రి హరీశ్‌రావు తోటపల్లి రిజర్వాయర్‌కు సీపీఐ వ్యతిరేకమంటూ దుష్ర్పచారం చేయడం తగదన్నారు. రూ.380 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.1600 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారని.. ఈ విషయంలో ఇంజనీర్లతో చర్చించేందుకు సిద్ధమన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ప్రజల తరపున మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు రాసిన లేఖను చూపించారు.
గద్దర్ త్వరలో నిర్ణయం వెల్లడిస్తారు
వరంగల్ ఎంపీ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా పోటీలో ఉండాలని గద్దర్‌కు విజ్ఞప్తి చేశామని.. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తారని చాడ అన్నారు.