సాక్షి, హైదరాబాద్: తన స్వార్థ రాజకీయాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం నాయకులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు కోరుకంటి అనిల్‌కుమార్, ఆలిండియా రీసెర్చ్ స్కాలర్ సంఘం ప్రతినిధి సుధీర్‌పాల్ మాట్లాడారు. ఏపీలో ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రాంతాల మధ్య విద్వేషాలు రగులుస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లపాటు కేసీఆర్, మోదీలతో అంటకాగి ఇప్పుడు బాబుకు నచ్చలేదని ప్రజలంతా వ్యతిరేకించాలా? అని నిలదీశారు.
ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌తో, కేంద్రం ఇచ్చిన నిధులు చెప్పక కేంద్రంతో తగువులు పెట్టుకుంది చంద్రబాబేనని స్పష్టం చేశారు. జగన్, కేటీఆర్ కలిస్తే ఏదో జరగరానిది జరిగినట్లు చంద్రబాబు గగ్గోలు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరినైనా కలవచ్చని తెలిపారు. తెలంగాణలో ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్లు చాలా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని, ఈసారి తనకు రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉండటంతో చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీ పార్టీకి చెందిన మురళీమోహన్, గల్లా జయదేవ్, సుజనా చౌదరి తదితరులు హైదరాబాద్‌లో ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంగతి మర్చిపోయారా? అని ప్రశ్నించార
Comments
Please login to add a commentAdd a comment