ప్రమాదవశాత్తు ఓ యువకుడు గోదావరిలో పడి ప్రాణాలొదిలాడు.
నిజామాబాద్(నవిపేట): ప్రమాదవశాత్తు ఓ యువకుడు గోదావరిలో పడి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవిపేట మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిజామాబాద్ మండలం మోపాల గ్రామానికి చెందిన బోంకన్ చంద్రకాంత్ రాజన్(17), స్నేహితుడితో కలసి నవిపేట మండలంలోని కోస్లీ వద్ద గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు.