అనుబంధ పోషణ కార్యక్రమంలో మార్పులు | Changes in affiliate nutrition program | Sakshi
Sakshi News home page

అనుబంధ పోషణ కార్యక్రమంలో మార్పులు

Published Fri, Dec 1 2017 1:26 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

Changes in affiliate nutrition program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న అనుబంధ పోషణ కార్యక్రమం(సప్లిమెంటరీ న్యూట్రీషన్‌ ప్రోగ్రామ్‌)లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ పథకాల కింద శిశువులు, పిల్లలు, గర్భిణులకు ఇచ్చే పోషకాహారానికి సంబంధించిన ధరలను పెంచింది. ప్రస్తుతం 6 నెలల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారంపై ప్రభుత్వం ప్రతి రోజు రూ.6 ఖర్చు చేస్తుండగా... దాన్ని రూ.8కి పెంచింది.

అదే విధంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సరఫరా చేస్తున్న పోషకాహారంపై ప్రతిరోజు రూ.7 ఖర్చు చేస్తుండగా... తాజాగా ఆ మొత్తాన్ని రూ.9.50కి పెంచింది. పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులకు సరఫరా చేసే పౌష్టికాహారంపై రూ.9 ఖర్చు చేస్తుండగా... ఇకపై రూ.12 ఖర్చు చేయనుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement