
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలోని కోర్సు ల్లో సిలబస్‌పై మార్పులు చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), తెలంగాణ సీఎం, విద్యా శాఖలకు ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఏఐఎఫ్‌ఎస్‌ఎఫ్‌టీఐ) బుధవారం లేఖ రాసింది. ఏఐసీటీఈ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీల్లో సిలబస్‌ను అమలు చేయాలని లేఖలో కోరింది. అలాగే కోర్సులు, సిలబస్‌లలో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులలోని సిలబస్‌లో కొన్ని అంశాలను చేర్చాలని తెలిపింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, త్రీడీ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ టెక్నాలజీ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటేనింగ్ ఇంజనీరింగ్, ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్, ఆర్టిఫీషియల్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఫిషరీస్ ఇంజనీరింగ్, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, జియో ఇన్‌ఫ్రామెటిక్స్, మెరైన్ ఇంజనీరింగ్, మెరైన్ టెక్నాలజీ, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్, తదితరాలను చేర్చాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం 2018–19 విద్యాసంవత్సరానికి కోర్సులను ప్రవేశపెట్టడంలో జేఎన్టీయూ హైదరాబాద్, కొన్ని లోకల్ యూనివర్సిటీలు విఫలమయ్యాయి. ఏఐసీటీఈ చేసిన ప్రతిపాదన ప్రకారం 2019–20 విద్యాసంవత్సరానికైనా అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖలు కృషి చేయాలని ఏఐఎఫ్‌ఎస్‌ఎఫ్‌టీఐ జనరల్ సెక్రటరీ కేవీకే రావు అభిప్రాయపడ్డారు. అక్రెడిటేషన్, అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీలని చెప్పుకునే కొన్ని టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment