సీఎం కేసీఆర్‌కు పాలించే హక్కు లేదు
- టీడీపీ నిరసన నిరాహార దీక్షలో
- టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి
జనగామ రూరల్ : దళిత, గిరిజనులను మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు పాలించే హక్కు లేదని టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ చౌరస్తాలో గురువారం టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు నిరసన నిరాహార దీక్షను దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి టీడీపీ పట్టణ అధ్యక్షుడు పోకల లింగయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమానుద్దేశించి దయాకర్‌రావు మాట్లాడుతూ గత ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ, కేజీ టు పీజీ విద్య, బ్యాంకుల నుంచి నేరుగా రుణాలు అందిస్తానని చెప్పి మో సం చేశారని అన్నారు.
తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తానని, చేయకుంటే మెడ నరుక్కుంటానని చేసిన శపథం ఏమైందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మాల, మాదిగలకు కేబినెట్‌లో చోటు కల్పించలేదన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జీ బస్వారెడ్డి మాట్లాడుతూ టీడీపీ క్యాడర్‌ను దెబ్బతీయాలనే చంద్రబాబు, రేవంత్‌రెడ్డిపై లేనిపోని కేసులను తెరమీదకు తెచ్చారన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గండ్ర సత్యనారాయణ, అనిశెట్టి మురళి, గట్టు ప్రసాద్‌బాబు, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు వజ్జ పరుశరాములు, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, సిరిగిరి నర్సయ్య, బొట్ల జీవరత్నం, జిల్లా ఉపాధ్యక్షులు ఉడ్గుల కిష్టయ్య పాల్గొన్నారు.
కేసీఆర్ నిరంకుశత్వంపై మరో పోరాటం
దేవరుప్పుల : అప్రజాస్వామికంగా అధికార ఆధిపత్యం కోసం ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులను లోబర్చుకుంటున్న కేసీఆర్ నిరంకుశత్వ పాలనపై మరో పోరాటం చేయాల్సిందేననీ టీటీడీఎల్పీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో 58 జీఓ కింద క్రమబద్ధీకరణ జరిగిన నివాసిత లబ్ధిదారులకు గురువారం ఆయన పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా తెలంగాణ ద్రోహులను పంచన చేర్చుకుని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేశం, ఎంపీపీ మానుపాటి సోమనర్సమ్మ, వైస్ ఎంపీపీ కొల్లూరి సోమయ్య, మాజీ మండల శాఖ అధ్యక్షుడు వీరారెడ్డి వృకోధర్‌రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు ఈదునూరి నర్సింహ్మరెడ్డి, కారుపోతుల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.