'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ'
'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ'
Published Mon, Sep 26 2016 5:34 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
కరీంనగర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు జలకళ వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలో సోమవారం ఆయన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు దాదాపుగా నిండాయన్నారు. మిషన్ కాకతీయలో చేపట్టని 120 చెరువులకు గండ్లు పడ్డాయని... ఈ ఏడాది రబీ సీజన్కు ఢోకా లేదన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. భారీ వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు తక్షణ పరిహారం చెల్లించాలని కేసీఆర్ ఆదేశించారు.
Advertisement
Advertisement