తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నేడు రెండు ప్రాజెక్టు అంశాలపై చర్చ జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నాలుగో రోజైన నేడు (మంగళవారం) రెండు ప్రాజెక్టు అంశాలపై చర్చ జరగనుంది. శాసనసభలో నేడు మిషన్ భగీరథ అంశంపై చర్చించనుండగా, శాసనమండలిలో చెరువుల పునరుద్ధరణ, పూడికతీత కార్యక్రమం మిషన్ కాకతీయపై చర్చ జరుగుతుంది.
కాగా, సోమవారం శాసనసభలో గ్యాంగ్ స్టర్ నయీం, అతని అనుచరులు సాగించిన నేర కార్యకలాపాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా, కేసు వారికి అప్పగించే ప్రసక్తే లేదని నిన్న సభలో సీఎం స్పష్టంచేశారు.