రేపు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ | cm kcr goes to mahaboob bagar district tomorrow | Sakshi
Sakshi News home page

రేపు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్

Published Wed, Jun 10 2015 7:11 PM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM

cm kcr goes to mahaboob bagar district tomorrow

భూత్పూర్ (మహబూబ్‌నగర్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న 'పాలమూరు-రంగారెడ్డి' ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం రానుండడంతో జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రూ.35 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ పనులకు చెందిన పైలాన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి నేరుగా మండలంలోని కరివెన గ్రామానికి చేరుకోనున్నారు. కరివెనలోనే పైలాన్ నిర్మించారు. అనంతరం జిల్లాలో పార్టీ ముఖ్యులు, అధికారులు, కరివెన గ్రామస్తులు దాదాపు 3 వేల మందితో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం భూత్పూర్‌లో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement