సీఎల్పీ నేత జానారెడ్డి
నాగార్జునసాగర్: ఉద్యోగాలు వస్తాయని నమ్మి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన యువతను రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మోసం చేస్తున్నారని సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాగార్జునసాగర్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి నేడు కేవలం 15వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. వ్యవసాయరంగాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేశారన్నారు.
తుంపర,బిందుసేద్యానికి ఈఏడాది ఇప్పటివరకు పైసావిదిలించలేదని, రైతులు గగ్గోలు పెడుతున్నా ముఖ్యమంత్రి చెవికెక్కడం లేదని విమర్శించారు. కాంగెరస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సాగర్‌లో తక్కువ ధరకు నివాసగృహాల కోసం ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులకు గజం రూ.750లకే ఇవ్వడానికి ప్రభుత్వం జీఓ ఇవ్వగా వారు ఇంతఖరీదు పెట్టలేమని ధర తగ్గించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం గజం ధరను రూ.3వేలకు ధర నిర్ణయించినట్లు తెలిసిందన్నారు. ఈపరిస్థితులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ కర్నాటిలింగారెడ్డి. యెడవెళ్లి విజయేందర్‌రెడ్డి, హాలియామండల సర్పంచులఫోరం అధ్యక్షులు భగవాన్‌నాయక్,శంకర్‌నాయక్,జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు.. కలాం
మాజీరాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ పేదరికంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహనీయుడని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లోని ఆయన నివాసంలో కలాం చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యుద్ధక్షిపణులను తయారు చేసి, శాస్త్రసాంకేతిక అంతరిక్ష రంగాలలో ప్రపంచదేశాల సరసన భారతదేశాన్ని నిలపిన ఘనత అబ్దుల్‌కలాందేనని తెలిపారు. నేటియువతకు ఆదర్శనీయుడని పేర్కొన్నారు. అందరు నడిచినబాటలో కాకుండా కొత్తదారిలో నడవాలని, ఓటమి గెలుపునకు పునాదని పేర్కొన్న మహనీయుడన్నారు.