‘పట్నం’కు నిధుల వరద | CM KCR Release funds to Ibrahimpatnam constituency | Sakshi
Sakshi News home page

‘పట్నం’కు నిధుల వరద

Published Wed, May 6 2015 1:55 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

CM KCR Release funds to Ibrahimpatnam constituency

- గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.10.80 కోట్లు విడుదల
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
- మిగతా హామీలపై విడుదల కానీ జీఓలు

‘ఇబ్రహీంపట్నం వజ్రపు తునకలాంటిది. ఈ ప్రాంతాన్ని ఊహిం చని రీతిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.’ సోమవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన బహిరంగసభలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న మాటలివి.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి రూ.10.80 కోట్లు మంజూరు చేస్తూ  మంగళవారం ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ  ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక నిధి (ఎస్‌డీఎఫ్) కింద ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నియోజకవ ర్గంలోని 79 పంచాయతీలు, 20 అనుబంధ గ్రామాలకు ఈ నిధులను విడుదల చేశారు. గ్రామ పంచాయతీల్లో అత్యవసర పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.

ఒక్కదానికే మోక్షం..!
ఇబ్రహీంపట్నంపై హామీల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి... మంగళవారం సాయంత్రం నాటికీ వాటికి సంబంధించిన జీఓలూ విడుదలవుతాయని ప్రజల హర్షాధ్వానాల మధ్య ప్రకటించారు. హైదరాబాద్-ఇబ్రహీంపట్నం వరకు సెంట్రల్ లైటింగ్, ఇబ్రహీంపట్నం చెరువులోకి వరద నీరు వచ్చే ప్రధాన వాగు (మాదాపూర్-ఎలిమినేడు) విస్తరణ, మాల్ వరకు నాలుగులేన్ల రహదారి అభివృద్ధి పనులకు రేపటిలోగా ఉత్తర్వులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీల్లో పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల మినహా.. ప్రధానమైన హామీలకు ఇంకా మోక్షం కలగకపోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement