
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణానికి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టి (సీఎంఆర్‌ఎస్) పచ్చ జెండా ఊపింది. మెట్టుగూడ-ఎస్‌ఆర్ నగర్ మార్గంలో 10 కిలోమీటర్లు మెట్రో రైలు నడిచేందుకు సీఎంఆర్‌ఎస్ ఆమోదం తెలిపింది. ఈ నెల 17 నుంచి 19 వరకు ఈ మార్గంలో సీఎంఆర్‌ఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 15 అంశాలపై తనిఖీలు నిర్వహించి క్లియెరెన్స్ ఇవ్వడంతో మెట్రో రైలు ప్రయాణానికి అన్ని అనుమతులు ఇచ్చినట్టైంది.
సీఎంఆర్‌ఎస్ అనుమతి మంజూరు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రారంభానికి సన్నాహాలు పూర్తయినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. నాగోల్-మియాపూర్ మార్గంలో పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని మైట్రో రైల్ ఎండీ, సీఈవో శివానంద్ నింబర్గీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment