కమిషన రైట్ | Commissioner Wright | Sakshi
Sakshi News home page

కమిషన రైట్

Published Fri, Aug 8 2014 2:39 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

కమిషన రైట్ - Sakshi

కమిషన రైట్

  •      రూ.100 కోట్లతో ఏర్పాటుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్
  •       కమిషనర్ కింద ముగ్గురు డీసీపీలు.. 10 మంది ఏసీపీలు
  •      కొత్తగా 3,536 మంది సిబ్బంది నియామకం
  •      నూతనంగా ఐదు పోలీస్‌స్టేషన్లు.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
  •      ఆగస్టు 15న లాంఛనంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్
  • వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్‌కు పోలీసు ఉన్నతాధికారులు తుది రూపం ఇచ్చారు. గతంలో తయారు చేసిన ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేపట్టి తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో పూర్తిస్థారుులో కమిషరేట్ ఏర్పాటు కోసం తయారుచేసిన తుది ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ కమిషనరేట్‌గా ప్రకటించడమే తరువారుు... పనుల వేగవంతం కానున్నట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్తగా పోలీస్‌స్టేషన్లు, నేరాల అదుపునకు టాస్క్‌ఫోర్‌‌స విభాగం ఏర్పాటుకానున్నాయి.  సర్కార్ ఆమోదం తెలిపిన ప్రణాళికలో కమిషనరేట్ రూపురేఖలు ఇలా ఉన్నాయి.
     
    బాస్‌గా కమిషనర్

    కమిషనరేట్‌కు బాస్‌గా కమిషనర్ వ్యవహరిస్తారు. డీఐజీ స్థారుు అధికారులను కమిషనర్‌గా నియమిస్తారు. వీరికి మెజిస్ట్రీరియల్ పవర్స్ కూడా ఇవ్వడంతో కొంత వరకు పరిపాలనా సౌలభ్యం లభిస్తుంది.
     
    ముగ్గురు డీసీపీలు

    కమిషనర్ కింద ముగ్గురు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)లు ఉంటారు. లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్‌కు ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. లా అండ్ ఆర్డర్ డీసీపీ కింద ఆరుగురు ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్)లు... క్రెం డీసీపీ కింద ఇద్దరు ఏసీపీలు, ట్రాఫిక్ డీసీపీ కింద ఇద్దరు ఏసీపీలు ఉంటారు.
     
    ఏసీపీ వ్యవస్థ ఇలా...
     
    ముగ్గురు డీసీపీల కింద 10 మంది ఏసీపీలు పనిచేస్తారు. ఇందులో లా అండ్ ఆర్డర్ కింద వరంగల్, హన్మకొండ, కేయూసీ, కాజీపేట, మామునూరు, వర్ధన్నపేట ఏసీపీలు... క్రైమ్ డీసీపీ కింద ఏసీపీ  క్రైం అండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్, ఏసీపీ సైబర్‌క్రైం... ట్రాఫిక్ డీసీపీ కింద ఏసీపీ ట్రాఫిక్ ఈస్ట్, ఏసీపీ ట్రాఫిక్ వెస్ట్ ఉంటారు.
     
    ఏసీపీల కింద పోలీస్‌స్టేషన్లు...
    వరంగల్ ఏసీపీ కింద మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్, మిల్స్‌కాలనీ, ఏనుమాముల
    హన్మకొండ ఏసీపీ కింద హన్మకొండ, సుబేదారి, శ్యాయంపేట, వడ్డేపల్లి
    కేయూసీ ఏసీపీ కింద కేయూసీ, హసన్‌పర్తి, ఆత్మకూరు, ఆరెపల్లి
    కాజీపేట ఏసీపీ కింద కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, ఘన్‌పూర్ ఉన్నాయి.
    ఏసీపీ మామునూరు కింద మామునూరు, లేబర్‌కాలనీ, సంగెం, గీసుగొండ
    ఏసీపీ వర్ధన్నపేట కింద వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, జఫర్‌గఢ్ (ఇందులో ఏనుమాముల, వడ్డేపల్లి, శాయంపేట, లేబర్‌కాలనీ,ఆరెపల్లి పోలీస్‌స్టేషన్లు కొత్త గా ఏర్పాటవుతున్నాయి.)
     
    డీసీపీ క్రైమ్ విభాగంలో
    ఏసీపీ క్రైమ్ అండ్ డబ్ల్యూ పీఎస్ కింద సీసీఎస్ తూర్పు, పశ్చిమ పోలీస్‌స్టేషన్లు.. అదేవిధంగా ఈస్ట్, వెస్ట్  ఉమెన్ పోలీస్‌స్టేషన్లు వస్తున్నాయి.

    ఏసీపీ సైబర్ క్రైం కింద క్లూస్‌టీం పనిచేస్తుంది.
     
    డీసీపీ ట్రాఫిక్ విభాగంలో..
    ట్రాఫిక్ ఏసీపీ ఈస్ట్ కింద వరంగల్, మామునూరు, వర్ధన్నపేట... ఏసీపీ ట్రాఫిక్ వెస్ట్ కింద హన్మకొండ, కేయూసీ, కాజీపేటలు వస్తున్నాయి.
         
    అదేవిధంగా ముగ్గురు అడిషనల్ డీసీపీల కింద సీపీఓ, కంట్రోల్‌రూం, ఏఆర్ అడిషనల్ డీసీపీ కింద ఏసీపీ ఏఆర్, ఏసీపీ సీఎస్‌డబ్ల్యూలు ఉంటారు.
     
    ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.....
     నగరంలో నేరాల నియంత్రణకు కమిషనరేట్ పరిధిలో టాస్క్‌ఫోర్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్క్‌కు ఏసీపీ బాస్‌గా ఉంటారు. ఏసీపీ కింద టాస్క్‌ఫోర్స్ ఈస్ట్ ఇన్‌స్పెక్టర్, టాస్క్‌ఫోర్స్ వెస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. వీరితోపాటు సిటీ స్పెషల్ బ్రాంచ్ (సీఎస్‌బీ)కి ప్రత్యేకంగా మరో ఏసీపీ ఉంటారు. ఇలా అన్ని విభాగాలతో కలిపి మొత్తం 14 మంది ఏసీపీలను నియమించనున్నారు.
     
    బడ్జెట్ వందకోట్లు...

    కమిషనరేట్ ఏర్పాటుకు రూ.వంద కోట్లకు పైగా బడ్జెట్ అవసరం ఉంటుందని ఉన్నతాధికారులు నివేదిక అందజేశారు. కమిషనరేట్ ఏర్పాటైన తర్వాత 167 మంది మినిస్ట్రీరియల్ స్టాఫ్, 221 వివిధ రకాల వాహనాలు, ఇలా అన్నింటి కోసం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది.
     
    3,536 మంది సిబ్బంది అవసరం
     కమిషనరేట్‌లో మొత్తం 5,484 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. అర్బన్‌లో ప్రస్తుతం 1,948 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే మరో 3,536 మంది సిబ్బందిని నియమించాలి.  
     
    కొత్త పోలీస్‌స్టేషన్లు ఇవే..
    కమిషనరేట్ ఏర్పాటులో భాగంగా కొత్తగా మరో 5 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏనుమాముల, వడ్డేపల్లి, శ్యాయంపేట, ఆరెపల్లి, లేబర్‌కాలనీల్లో ఏర్పాటు కానున్నారుు. ఇందులో ఒక్క సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోనే మరో రెండు రావడం గమనించదగ్గ విషయం. విస్తీర్ణం, నేరాల సంఖ్య అదుపు ప్రాతిపదికన  కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి.
     
    ఏనుమాముల పీఎస్ పరిధిలోని ప్రాంతాలు...
    దేశాయిపేట, సీకేఎం కాలేజీ, ఎంహెచ్‌నగర్, వినాయకనగర్, ఫిల్టర్‌బెడ్, నవయుగ కాలనీ, కాశిబుగ్గ, రెడ్డిపాలెం, ఏఎంసీ ఏనుమాముల మార్కెట్, ఎన్‌టీఆర్‌నగర్, కోటిలింగాల గుడి, బాలాజినగర్, ఎస్సార్‌నగర్, సుందరయ్యనగర్, లక్ష్మి మెగా టౌన్‌షిప్.
     
    లేబర్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో...
    దయానందకాలనీ,యాకుబ్‌పురా,భరత్‌పెట్రోల్‌పంపు, అ బ్బనికుంట, ప్లాటినం జూబ్లీ స్కూల్, ఎస్సార్‌టీ, టీఆర్‌టీ క్వార్టర్స్, తెలంగాణ జంక్షన్, వెంకట్రమణ థియేటర్, ఓసిటి చౌరస్తా, క్రిస్టియన్ కాలనీ, చెన్నారెడ్డి కాలనీ, ఈఎస్‌ఐ హాస్పిటల్, ఆయుర్వేద మెడికల్ కాలేజీ, లక్ష్మీనగర్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఆఫీస్,చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి,గీసుకొంగ ఎక్స్ రోడ్స్, వీ టితోపాటు మరికొన్ని చుట్టుపక్కలప్రాంతాలు వస్తున్నాయి.
     
    వడ్డేపల్లి పోలీస్‌స్టేషన్...
    టీచర్స్‌కాలనీ ఫేజ్-2, వడ్డేపల్లి, కనకదుర్గకాలనీ, విజయపాల్‌కాలనీ, భవానినగర్, శ్రీనగర్‌కాలనీ, ఇందిరానగర్, రాఘవేంద్రనగర్, వడ్డేపల్లి చర్చి, తెలంగాణ కాలనీ, టీఎన్‌జీవోస్ కాలనీ, ‘కుడా’ ఎన్‌క్లేవ్, అమరావతి నగర్‌లు వస్తున్నాయి.
     
    న్యూశాయంపేట పోలీస్‌స్టేషన్...

    న్యూశాయంపేటలో ఏర్పాటుచేసే పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రెవెన్యూకాలనీ, ప్రగతినగర్, పోస్టల్‌కాలనీ, జులైవాడ, నాగేంద్రనగర్, దీన్‌దయాల్‌నగర్, సహకారనగర్, నందిహిల్స్, బాసిత్‌నగర్, పోలీస్‌కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీ, ప్రకాశ్‌రెడ్డిపేట, గణేష్‌నగర్, న్యూశ్యాయంపేట విలేజీ, కింగ్స్‌వే దాబా, డీఈఓ ఆఫీస్ ఏరియాలు వస్తున్నాయి.
     
    ఆరెపల్లి పోలీస్‌స్టేషన్.....
    ఆరెపల్లిలో ఏర్పాటుచేసే పీఎస్ పరిధిలో పైడిపల్లి, వంగపహాడ్, సిద్ధాపూర్, ఆరెపల్లి, భైరాన్‌పల్లి వస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement