
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న అర్హత పరీక్షలు వెంటవెంటనే ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. పరీక్షలు బుధవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి ఆయన వినతిపత్రం అందజేశారు. రానున్న రెండు నెలల పాటు వరుసగా పోటీ పరీక్షలున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు వాయిదా వేసే పరిస్థితి లేనందున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష తేదీలను మార్చాలని కోరారు.
రైల్వే పరీక్షలు వచ్చే నెలాఖరు వరకు ప్రతి రోజు మూడు షిప్టుల్లో ఉన్నాయని, ఇదే సమయంలో కానిస్టేబుల్, గురుకుల, ట్రాన్స్‌కో, గ్రూప్–4 పరీక్షలున్నాయన్నారు. ఈ నెల 30న కానిస్టేబుల్ పరీక్ష ఉండగా.. అదేరోజు ట్రాన్స్‌కో జేఏ పోస్టుకు సంబంధించిన పరీక్షలున్నాయని పేర్కొన్నారు. పరీక్షల తేదీలను పూర్తిస్థాయిలో పరిశీలించి పరస్పర విరుద్ధం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత విభాగాలకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment