‘ఈ ఎన్నికతో కాంగ్రెస్ ఖాతా క్లోజ్’
భూపాలపల్లి : కాంగ్రెసోళ్ల మొహం చూస్తే ఎవరూ ఓట్లు వేయరని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఇటీవల చేపట్టింది రైతు భరోసా యాత్ర కాదని, కాంగ్రెస్ పరేషాన్ యా త్ర అని ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాతా క్లోజ్ కావడం ఖాయమన్నారు. టీడీపీ, బీజేపీలు వరంగల్ జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు.
సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కుంచాల సదా విజయ్‌కుమార్, సిరికొండ ప్రదీప్, ప్రశాంత్, క్రాంతి, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణరవి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, నాయకులు మేకల సంపత్‌కుమార్, మందల రవీందర్‌రెడ్డి, క్యాతరాజు సాంబమూ ర్తి, పైడిపెల్లి రమేష్, నియోజకవర్గంలో ని టీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.