కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి
- పవన్‌కళ్యాణ్ పిలుపు
- సీతాఫల్‌మండి, ఖైరతాబాద్, హైదర్‌నగర్‌లలో ప్రచారం
బౌద్ధనగర్/ఖైరతాబాద్, న్యూస్‌లైన్: అస్తవ్యస్త పరిపాలనను దేశానికి అందించిన కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో కూకటివేళ్లతో తెంచివేయాలని జన సేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్‌కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ ని యోజకవర్గం సీతాఫల్‌మండి చౌరస్తా లో, ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో, శే రిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైదర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో ఆయన ప్రసంగిస్తూ దేశాన్ని సమగ్రాభివృద్ధి చేయగల్గిన నా యకుడు నరేంద్రమోడీ మాత్రమేనన్నా రు. దేశం, రాష్ట్రం అభివృద్ధి, ప్రయోజనాల దృష్ట్యా జనసేన కార్యకర్తలు బీజేపీ, టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహిళ హక్కులను సంరక్షించి వారికి తగిన రక్ష ణ కల్పించేందుకు జనసేన పాటు పడుతుందన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావులది కుటుంబపాలన అని విమర్శించారు. అందరినీ ఒప్పించి సులభంగా పరిష్కారించాల్సిన రాష్ట్ర విభజన సమస్యను 1200 మంది ప్రా ణాలు విడిచే వరకు కేంద్రం పరిష్కరిం చక పోవడం దారుణమన్నారు. బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి బండారు దత్తాత్రేయ తనకు సన్నిహితుడని, 1978 దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన సేవలు ప్రశంసనీయమన్నారు.
దత్తాత్రేయ, కూన వెంకటేష్‌గౌడ్‌లను ఓటర్లు బలపర్చాలని పవన్‌కళ్యాణ్ పిలుపుని చ్చారు. ‘కాంగ్రెస్‌కు హటావో -దేశ్‌కు బచావో’ అనినినదిస్తూ సభికులను ఉ త్సాహపరిచారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి బండారు దత్తాత్రేయ, కూన వెంకటేష్‌గౌడ్ (సికింద్రాబాద్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్-బీజేపీ), అరికెపూడి గాంధీ (శేరి లింగంపల్లి-టీడీపీ) మాజీ మంత్రి కె.విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.