- సమన్వయంతో పనిచేసి ఫలితం సాధించాలన్న దిగ్విజయ్
- జిల్లా పరిషత్ మాదిరిగా చేజార్చుకోవద్దని సూచన
- రాష్ట్ర సదస్సులో జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ
- సదస్సుకు బస్వరాజు, గండ్ర గైర్హాజరు
వరంగల్ : త్వరలో జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాం గ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్‌సింగ్ జిల్లా నాయకులకు సూచించా రు. నాయకులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయన్నారు. హైదరాబాద్‌లో ఆది వారం ప్రారంభమైన కాంగ్రెస్ రాష్ట్ర సదస్సు సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని పార్టీ నాయకులతో దిగ్విజయ్‌సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పది రో జుల్లో బూత్ స్థారుు నుంచి జిల్లా కమిటీల వరకు ఏర్పాటు చేయూలని సూచించారు.
జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికంటే పనిచేసే వారికే టికె ట్ ఇవ్వాలని చెప్పారు. టికెట్ ఇప్పించిన నాయకులే.. ఆ అభ్యర్థి గెలుపు బా ధ్యతలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాపరిషత్ ఎన్నికల మాదిరిగా కార్పొరేషన్‌ను చేజార్చుకోకూడదని ఆయన నాయకులకు ప్రత్యేకంగా చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా, నగర కాంగ్రెస్ నాయకులతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు పాల్గొన్నారు.
బస్వరాజు, గండ్ర గైర్హాజరు
రెండు రోజులపాటు జరిగే రాష్ట్ర కాంగ్రెస్ సదస్సుకు జిల్లా నుంచి మొదటి రోజు 250 మంది ప్రతినిధులు హాజరుకాగా.. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి గైర్హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగ్, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్‌నాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్‌రావు, డాక్టర్ హరిరమాదేవి, కొండేటి శ్రీధర్, మాలోతు కవిత, డాక్టర్ బండా ప్రకాష్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజనాల శ్రీహరి, ఈవీ శ్రీనివాస్, బట్టి శ్రీనివాస్, బస్వరాజు కుమార్, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్, పోశాల పద్మ, రావుల సదానందం, ద ండ్రె రమేష్, దరిగె నిరంజన్, మహేందర్ తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.