పార్టీలో సమర్థవంతమైన నేతలు ఉన్నప్పటికీ...
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీ వీడటం తీవ్ర విచారకరమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు కె.జానారెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చకోవడంపై గురువారం హైదరాబాద్లో విలేకర్లు ప్రశ్నించినప్పుడు కె.జానారెడ్డిపై విధంగా స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకులకు కొదవ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ నాయకులను సరైన సమయంలో సరైన విధంగా తాము ప్రొజెక్ట్ చేయలేకపోయామని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పార్టీ అధిష్టానం... ఎన్నికల ముందు హడావుడిగా రాష్ట్ర నాయకత్వంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిందంటూ పరోక్షంగా పీసీసీ చీఫ్ పొన్నాల నియామకాన్ని జానారెడ్డి వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేస్తామనమి ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సాధ్యమైనంత త్వరలో పార్టీ పరిస్థతిని సమీక్షించుకుంటామని జానారెడ్డి వెల్లడించారు.