ల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద పోలీసులకు, దోపిడీ దొంగలకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందాడు.
సూర్యాపేట: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద పోలీసులకు, దోపిడీ దొంగలకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో కట్టంగూరు పీఎస్ కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందాడు. అలాగే ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్య పరిస్థితి విషమంగా ఉంది. సిద్ధయ్య స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల.
ఇక రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి సోదాలు జరుపుతున్న పోలీసులపై కాల్పులకు తెగబడి సంఘటనలో ఓ కానిస్టేబుల్, హోంగార్డు మృతి చెందారు. ఈ కాల్పుల ఘటనలో గాయపడ్డ సీఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.