ఫేస్బుక్ వేదికగా కానిస్టేబుళ్లు.. | constables post Inappropriate posts in facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ వేదికగా కానిస్టేబుళ్లు..

Published Thu, Aug 3 2017 1:23 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

ఫేస్బుక్ వేదికగా కానిస్టేబుళ్లు.. - Sakshi

ఫేస్బుక్ వేదికగా కానిస్టేబుళ్లు..

కరీంనగర్: ఫేస్బుక్ వేదికగా విద్యార్థినులను కించపరుస్తూ ముగ్గురు కానిస్టేబుళ్లు ఆసభ్యకర పోస్ట్లు చేశారు. వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ సీపీఎం నగర సెక్రటరీ సత్యం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత నెల 28న కరీంనగర్ కలక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతున్న సమయంలో విద్యార్థినులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థినులతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ అంశంపై వన్టౌన్కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఫేస్బుక్లో అసభ్యకర పోస్టింగ్లు చేశారు. రాయలేని భాషలో విద్యార్థినులను దూషించడంతో పాటు మీడియాపై కూడా అసభ్య పదజాలంతో పోస్ట్లు చేశారు. నగరంలో ఇది హాట్ టాపిక్గా మారడంతో సీపీఎం సెక్రటరీ, సామాజికి ఉద్యమకారుడు గుడికందుల సత్యం సదరు కానిస్టేబుళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సీఐ తులా శ్రీనివాస్రావుకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement