సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన పుట్టిస్తుండగా.. తాజాగా 12 ఏళ్ల లోపు 20 మంది చిన్నారులకు కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. వారికి గాంధీ ఆస్పత్రిలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిబంధనల మేరకు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. బాధితుల్లో 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. గాంధీలోని ఆరో ఫ్లోర్‌లో ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేసి 20 మంది ప్రత్యేక వైద్య నిపుణులు చిన్నారులకు సేవలందిస్తున్నారు.
(చదవండి: మరో 52 మందికి కరోనా పాజిటివ్)
కాగా, చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని గాంధీ వైద్యులు తెలిపారు. వారిలో 3 ఏళ్ల బాలుడికి ఇతర ఆరోగ్యసమస్యలు ఉండటంతో చికిత్స అందించడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్యం త్వరలో మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం మరో 52 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 644కి చేరుకుంది. కరోనాతో 18 మంది మృతి చెందారు. మొత్తం 110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 516 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
(చదవండి: గాంధీ ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది సమ్మె)
Comments
Please login to add a commentAdd a comment