
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోందని, గత ఐదేళ్లలో ప్రవేశ పెట్టిన పథకాలతో సత్ఫలితాలు వస్తున్నాయ ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. అవినీ తి తగ్గటంతో పాటు అభివృద్ధి ఫలాలు సామా న్యుల లోగిలికి చేరుతున్నాయన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు లక్ష్మణ్, ప్రేమేందర్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కిసాన్ సమ్మాన్ యోజనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 12.91 లక్షల మంది రైతుల జాబితాను అప్‌లోడ్ చేసిందని, అందులోని 5 లక్షల మంది ఖాతా ల్లోకి డబ్బు జమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసా సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.