ఎందుకు అనుమతివ్వడం లేదు?
ధర్నాచౌక్ వద్ద నిరసనలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు దేశ పౌరులందరికీ ఉంద ని, ధర్నాచౌక్ వద్ద నిరసనలకు ఎందుకు అనుమతినివ్వలేదో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అం శానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబా ద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూరి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
ధర్నా చౌక్ వద్ద గతంలోలా నిరసనలు, సమావేశా లకు అనుమతినిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశిం చాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు వేసిన పిల్‌పై మంగళవారం ధర్మాసనం విచా రణ జరిపింది. పిటిషనర్ తరపున న్యాయ వాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రెండు మూడు దశాబ్దాల నుంచి ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా యని, ఏ ప్రభుత్వమూ వాటిని అడ్డుకో లేదని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ధర్నా చౌక్‌ను అక్కడి నుంచి తరలించి, శివార్లలో ఏర్పాటు చేయాలని భావిస్తోందని చెప్పారు.
అంత దూరం వెళ్లి ఎవరు నిరసన కార్యక్ర మాలు చేపట్టగలరన్నారు. కేసీఆర్ ధర్నా చౌక్‌ను మార్చడం లేదని చెబుతున్నారని, కానీ పోలీసులు ఎటువంటి నిరసనలకూ అనుమతినివ్వడం లేదని చెప్పారు. ధర్మాస నం స్పందిస్తూ.. ‘నిరసన తెలియజేయడం ఈ దేశ పౌరుని హక్కు. దానిని ఏ ఒక్కరూ హరించజాలరు’ అని స్పష్టం చేసింది. ఈ సమయంలో ఏజీ కె.రామ కృష్ణారెడ్డి స్పంది స్తూ.. గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇందుకు ధర్మా సనం అంగీకరిస్తూ.. ప్రతివా దులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది.