కాడి ఎత్తేస్తున్న కౌలురైతు
వారు పుడమి పుత్రులు.. ఊహ తెలిసిన నాటి నుంచి వారు మట్టినే నమ్ముకున్నారు. వారికి తెలిసిన పని ఒక్కటే వ్యవసాయం. ఉన్న కాస్తో కూస్తో భూమితో మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తూ ఉపాధిపొందుతున్నారు. ప్రకృతి కరుణించి, గిట్టుబాటు ధర బాగుంటే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చుననే ఆశ. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. పెరిగిన ధరలు, కూలీల రేట్లతో పాటు వేలకువేల రూపాయలు భూమి యజమానికి ముందుగానే చెల్లించి కౌలు చేసేందుకు రైతులు జంకుతున్నారు.
- దామరచర్ల
కౌలు రైతులు వ్యవసాయం చేసేందుకు ఒకింత భయపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడం, మద్దతు ధర వంటి కారణాలు రైతును సేద్యానికి దూరం చేస్తున్నాయి. మరోవైపు కౌలురేట్లు అధికంగా పెరగడం, అందులోనూ భూమి యజమానులు ముందస్తుగా కౌలు అడుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని వరిపొలాలు, దామరచర్ల, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, పెద్దవూర, నకిరేకల్, కేతేపల్లి, తుంగతుర్తి, తిరుమలగిరి తదితర మండలాల్లోని నల్లరేగడి భూములు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చికి అనుకూలం. దీంతో అనేక మంది రైతులు వేలాది ఎకరాల భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కానీ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం, ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి నష్టాలను చవిచూస్తున్నారు.
ముందస్తు కౌలుకు దూరం
గతంలో వ్యక్తులపై నమ్మకంతో భూమిని కౌలుకు ఇచ్చేవారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేకపోవడంతో భూ యజమానులు ముందస్తుగానే కౌలు తీసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగ కు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో భూయజమానులు కౌలును ఒక్కసారిగా పెంచారు. మాగాణి భూములకు ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేలు, నల్లరేగడి నేలకు ఎకరానికి రూ.18వేల నుంచి రూ.22వేలు డిమాండ్ చేస్తుండడంతో కౌలురైతులు ఆలోచనలో పడ్డారు.
కలవర పెడుతున్న ఎరువుల ధరలు
ఎన్నడూ లేని విధంగా కాం ప్లెక్స్ ఎరువుల ధరలు పెరి గాయి. పెట్టుబడి రెట్టింపు అయ్యింది. పురుగు మందులు, ఎరువులు ఉద్దెర ఇచ్చే వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడం, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు హామీగానే మిగిలిపోవడంతో పెట్టుబడులు లేక ఈ ఏడాది కౌలు రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు.
కౌలు భారమవుతుంది
ఏయేడుకు ఆయే డు కౌలు ధరలు పెరుగుతున్నా యి. పంట చేతికివచ్చాకా కౌలు చెల్లిస్తానంటే భూ యజ మాని నమ్మే పరిస్థితిలే దు. అప్పు తెచ్చి ముందస్తుగా కౌలు చెల్లించాలి. పంట పండినా.. పండకపోయినా సంబంధం లేదు. ఎరువుల ధరలు, కూలీల ధరలు పెరిగినంతగా పంట దిగుబడి పెరగడం లేదు. గిట్టుబాటుధర లభించడం లేదు.
- కందుల నారాయణరెడ్డి, కౌలురైతు