
సీపీఎంరాష్ట్ర కార్యదర్శివర్గంలోకి జూలకంటి
నర్సింహారెడ్డితో పాటు రంగారెడ్డికి చోటు
మరో ఐదుగురికి రాష్ట్ర కమిటీలో స్థానం
జిల్లా నుంచి పార్టీలో పెరిగిన ప్రాతినిధ్యం
(సాక్షి ప్రతినిధి, నల్లగొండ) : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శివర్గానికి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 1 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పార్టీ తొలి మహాసభల్లో ఆయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యదర్శివర్గంలో జిల్లా కార్యదర్శిగా నంద్యాల నర్సింహారెడ్డి ఉండగా, ఇప్పుడు కొత్తగా జూలకంటికి అవకాశం కల్పించారు. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు జిల్లా నేతలను పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. గతంలో రాష్ట్ర కమిటీ సభ్యులైన తుమ్మల వీరారెడ్డి, తిరందాసుగోపి, ముల్కలపల్లి రాములుకు మళ్లీ రాష్ట్ర కమిటీలో అవకాశం లభించగా, కొత్తగా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎం.డి.జహంగీర్‌లను కూడా రాష్ట్ర కమిటీలోకి తీ సుకున్నారు.
దీంతో మొత్తం రాష్ట్ర కమిటీలో జిల్లాకు ఏడు బె ర్తులు దక్కినట్టుయింది. ఇందులో ఇద్దరిక కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి కార్యదర్శివర్గంలో స్థానం దక్కడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్ర కమిటీలో స్థానం ఉండేది. వీరిలో న ంద్యాల నర్సింహారెడ్డిని గతంలోనే ఏర్పాటు చేసిన తె లంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గంలోనికి తీసుకున్నారు. జిల్లా కార్యదర్శి హోదాలో మరోసారి ఆయన కార్యదర్శివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఈసారి రాష్ట్ర కమిటీలో మొత్తం ఏడుగురికి స్థానం దక్కడంతో సీపీఎంకు బలమైన జిల్లాగా పేరున్న నల్లగొండ ప్రాతినిధ్యం మొత్తం మీద ఆ పార్టీలో పెరిగినట్టయింది.
కార్మిక నాయకుడి నుంచి శాసనసభా పక్ష నేత వరకు....
మిర్యాలగూడ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి 1994, 2004, 2009లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 కంటే ముందు ఆయన మిర్యాలగూడ మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా పార్టీ శాసనసభాపక్ష నేత హోదాలో పనిచేశారు. పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన సీఐటీయూ లో చురుకుగా పనిచేసి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన జూలకంటి జిల్లాలో జరిగిన అనేక ప్రజాపోరాటాల్లో తన వంతు పాలుపంచుకున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం పక్షాన ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష అప్పట్లో సంచలనం సృష్టిం చింది. సాగర్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలంటూ ఆయన 11 రోజుల పాటు మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్ష చేశారు.