
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
బెంబేలెత్తిపోతున్న ప్రజలు
మెదక్/జోగిపేట : రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో మెతుకు సీమ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం మెదక్‌లో 10 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు శనివారం 9 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో సాయంత్రం 4 గంటల నుండే చలి గాలులు మొదలయ్యాయి. చలిని తట్టుకోలేక సాయంత్రం 6గంటలకే ఇళ్లముఖం పట్టడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు చలిగాలులతో చిన్నారులు, వయస్సు మళ్లిన వా రు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. శ్వాస సంబంధమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం తగ్గక పోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు లేనిదే బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. అదేవిధంగా జోగిపేటలో శుక్రవారం రోజు న 9.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో శనివారం 6.30 గంట లైనా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారా యి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చలి మంటలు వేసుకుని వేడిని కాపుకోవడం కనిపించింది. ముఖం నిండా కట్టుకుని, షట్టర్లు వేసుకుని చలి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసుకునాన్నారు. చలి తీవ్రత పెరగడంతో స్వెట్టర్లు, గ్లౌజ్‌లకు గిరాకీ బాగా పెరిగింది.