ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని సులనగర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని సులనగర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి బోనోవత్ ఇందు(18) ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇందు చిన్న తమ్ముడు అఖిల్ స్కూల్ నుంచి వచ్చి ఆ సంఘటన చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
(టేకులపల్లి)