![చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం](/styles/webp/s3/article_images/2017/09/2/61426756155_625x300.jpg.webp?itok=S0xK4XTC)
చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం ప్రతిష్టించిన ఆరు నెలలకే నేలమట్టమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం కొద్దిగా ఒరిగి ఉన్న విగ్రహం బుధవారం రాత్రి చూసేసరికి నేలపై పడిపోయి ఉంది. ఎవరైనా విగ్రహాన్ని కూల్చివేశారా లేక దానంతట అదే కూలిందా అన్నది మిస్టరీగా మారింది. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.