దిశ కేసులో కీలక మలుపు | Disha Case, High Court Set Up Fast Track Court | Sakshi
Sakshi News home page

దిశ కేసులో కీలక మలుపు

Published Wed, Dec 4 2019 4:24 PM | Last Updated on Wed, Dec 4 2019 4:31 PM

Disha Case, High Court Set Up Fast Track Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయనుంది. మహబూబనగర్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు సెషన్స్‌ జడ్జిని నియమిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్‌ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుతో విచారణను వేగంగా పూర్తిచేసి.. ఈ కేసులో దోషులను తేల్చి..  కఠినశిక్ష విధించాలని ప్రభుత్వం తరఫున లా సెక్రటరీ సంతోష్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement