![మోసగాళ్ల మాటలు నమ్మొద్దు: టీఎస్‌పీఎస్సీ](/styles/webp/s3/article_images/2017/09/3/61441312071_625x300.jpg.webp?itok=H1p3bYNx)
మోసగాళ్ల మాటలు నమ్మొద్దు: టీఎస్‌పీఎస్సీ
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలిచ్చే మోసగాళ్లను నమ్మవద్దని, నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకై నిర్వహించే పరీక్షల్లో టీఎస్‌పీఎస్సీ నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరిస్తుందని కమిషన్ కార్యద ర్శి పార్వతి సుబ్రమణియన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసేవారి వివరాలను vigilance@tspsc.gov.inఈమెయిల్ ఐడీకి పంపాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.