Tsps
-
TSPSCపై హైకోర్టు ఆగ్రహం.. విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు నేడు(మంగళవారం) విచారణ చేపట్టింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ టీఎస్పీఎస్సీ కమిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలో ఆడుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అయ్యిందని, రెండోసారి కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతోపాటు కమిషన్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. చదవండి: ట్యాంక్ బండ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ -
‘గ్రూప్–2’పై స్టే పొడిగింపు
వచ్చే నెల 14 వరకు పొడిగించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రూప్–2 నియామక ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను హైకోర్టు జూలై 14 వరకు పొడిగించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి మరో పది రోజుల గడువునిచ్చింది. తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–2 మెరిట్ జాబితాలో అనర్హులకు చోటు కల్పించారని, నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన వి.రామచంద్రారెడ్డి, పి.శ్రీచరణదాస్ మరో 34 మంది వేర్వేరుగా రెండు వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. ఓఎంఆర్ షీట్లో రెండుసార్లు దిద్దరాదని (డబుల్ బబ్లింగ్), వైట్నర్ వాడరాదన్న నిబంధనను అతిక్రమించినందుకు టీఎస్పీఎస్సీ కొందరి జవాబుపత్రాల మూల్యాంకనం చేయకపోవడంతో పది మంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌ను హైకోర్టు ఏప్రిల్ 24న కొట్టేయడంతో వారంతా అనర్హులయ్యారు. అయినప్పటికీ వారి పేర్లు కూడా మెరిట్ జాబితాలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. టీఎస్పీఎస్సీ చర్య వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని, పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ జంబ్లింగ్ విధానాన్ని అనుసరించలేదని కూడా పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై గత ఆదేశాల కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని టీఎస్పీఎస్సీ కోరడంతో న్యాయమూర్తి అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను జూలై 4కి వాయిదా వేశారు. -
అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) కామర్స్ ప్రిపరేషన్
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నుంచి హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డులో అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటన విడుదలైంది. దీనిద్వారా మొత్తం 115 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీకామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇదో గొప్ప అవకాశం. రూ.16,400- రూ.49,870 వేతన స్కేలున్న ఈ ఉద్యోగాన్ని చేజిక్కించుకుంటే సుస్థిర కెరీర్ సొంతమైనట్లే! ఈ నియామకాలకు నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లుంటాయి. మొదటిది అందరికీ తెలిసిన జనరల్ స్టడీస్ కాగా, రెండోది కామర్స్ పేపర్. విజయానికి కీలకమైన రెండో పేపర్లో అధిక మార్కుల సాధనకు సబ్జెక్టు నిపుణుల సలహాలు... అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షలోని రెండు పేపర్లకు ఒక్కో దానికి 150 చొప్పున మార్కులుంటాయి. రెండో పేపర్ కామర్స్‌లో ఇచ్చే ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ కామర్స్‌లో అకౌంటింగ్ ముఖ్యమైన సబ్జెక్టు. దీనికి సంబంధించిన చాలా అంశాలు అసిస్టెంట్ నియామక పరీక్ష సిలబస్‌లో ఉన్నాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే తొలుత ప్రాథమిక అంశాలను నేర్చుకొని, వాటి అప్లికేషన్స్‌ను డిగ్రీ స్థాయిలో అధ్యయనం చేయాలి. వ్యాపార గణక శాస్త్రం (అకౌంటింగ్) 1. ఫైనాన్షియల్ అకౌంటింగ్: అకౌంటింగ్ బేసిక్స్, చిట్టా పద్దులు, ఆవర్జా, సహాయక చిట్టాలు, నగదు పుస్తకం, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ, అంకణా, ముగింపు లెక్కలు, తప్పుల సవరణ, తరుగుదల, రిజర్వ్‌లు-ఏర్పాట్లు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. వీటి కాన్సెప్టులపై పట్టుసాధించి, తర్వాత పూర్తిస్థాయిలో ఆబ్జెక్టివ్‌గా ప్రిపరేషన్ కొనసాగించాలి. 2. అడ్వాన్స్డ్ అకౌంటింగ్: ఒంటిపద్దు విధానం, అద్దె-వాయిదాల కొనుగోలు పద్ధతి, వ్యాపారేతర సంస్థల ఖాతాలు, బ్రాంచి ఖాతాలు, భాగస్వామ్య ఖాతాలు, జీవిత బీమా ఖాతాలు, డిపార్టుమెంట్ ఖాతాలు, బ్యాంకు ఖాతాలుంటాయి. 3. కార్పొరేట్ అకౌంటింగ్లో గుడ్‌విల్, వాటాలు, డిబెంచర్లు జారీ, విమోచనం, కంపెనీ ముగింపు లెక్కలు, బోనస్ వాటాలు, నమోదుకు ముందు లాభాలు, సంయోగం-అంతర్గత పునర్నిర్మాణం అంశాలపై దృష్టిసారించాలి. ప్రశ్న కోణాన్ని పట్టుకోవాలి: ఏ అంశాన్ని చదువుతున్నా, దాని మూలాలపై పట్టుసాధించి, ఆ అంశం నుంచి ఏ కోణాల్లో ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందో గుర్తించాలి. అప్పుడే ప్రిపరేషన్ సంపూర్ణమవుతుంది. ఉదాహరణకు అకౌంటింగ్‌కు సంబంధించి అకౌంటింగ్ అంటే ఏమిటి? ఖాతాలు అంటే ఏమిటి? ఖాతాల రకాలు, వాటి సూత్రాలపై పూర్తిస్తాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. కేవలం సబ్జెక్టులో ఉన్న సమస్యలను నేర్చుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు. వ్యవహారాలను ఏఏ ఖాతాల్లో, ఏ విధంగా నమోదు చేయాలో తెలుసుకోవాలి. కాస్టింగ్: ఇందులో వ్యయ నివేదిక, టెండర్, మెటీరియల్స్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్, బ్రేక్-ఈవెన్ విశ్లేషణ, బడ్జెట్ నియంత్రణ తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. వాణిజ్య శాస్త్రం వ్యాపార నిర్వహణ, సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం, హిందూ అవిభక్త కుటుంబం-కంపెనీలకు సంబంధించి థియరీపై మాత్రమే పట్టుసాధించాలి. ఇందులో సమస్యలుండవు. భాగస్వామ్యం, కంపెనీ చట్టాలు, లాభాలు, నష్టాలు వంటి అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.మేనేజ్మెంట్లో ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, విభాగీకరణ, సమన్వయం; వ్యాపార అర్థశాస్త్రంలో డిమాండ్-సప్లయ్‌ల విశ్లేషణ, ఉత్పత్తి విశ్లేషణ, మార్కెట్, వ్యాపార చక్రం, జాతీయ ఆదాయం, అంతర్జాతీయ వ్యాపారం వంటి అంశాలను చదవాలి. ఆదాయ పన్ను: దీనికి సంబంధించి జీతాల నుంచి ఆదాయం, ఇంటి అద్దె నుంచి ఆదాయం, ఇతర ఆదాయాలు, స్థూల ఆదాయం, మొత్తం ఆదాయం అంశాలను నేర్చుకోవాలి. ఆదాయ పన్ను రిటర్న్‌లను ఏ విధంగా దాఖలు చేయాలి. వాటి సెక్షన్లు, తగ్గింపుల (ఏ సెక్షన్‌కు ఎంత తగ్గింపు ఉంటుంది..)పై అవగాహన అవసరం. అదే విధంగా వస్తు విక్రయ చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం, కంపెనీల చట్టం అంశాలను సంవత్సరాలతో సహా చదవాలి. ఆడిటింగ్: ఇది పూర్తిగా థియరీ సబ్జెక్టు. ఇందులో ఆడిట్ ప్రణాళిక, నిర్వహణ, ఆర్థిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులు, భారతదేశ ఆర్థిక పద్ధతి, బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకు-ఖాతాదారుడు మధ్య సంబంధం, ఇన్సూరెన్స్ పద్ధతులు అంశాలకు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రత్యేక పుస్తకంలో రాసుకోవాలి. వీటిని వీలైనప్పుడల్లా రివిజన్ చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం: కంప్యూటర్-పరిచయం; ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఆండ్రాయిడ్, ఐవోఎస్..), విండోస్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్, ఈ-కామర్స్ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వివరాల నమోదు కీలకం అకౌంటింగ్‌కు సంబంధించి ప్రతి చాప్టర్లో ఉన్న అంశాలను నేర్చుకోవాలి. అయితే సమస్యలను పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మూడు వరుసల నగదు పుస్తకంలో సమస్య మొత్తాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభ నిల్వలను ఎక్కడ నమోదు చేయాలి? ఒకవేళ ప్రతికూల నిల్వ అయితే ఎక్కడ రాయాలి? ఎదురు పద్దును ఏ విధంగా నమోదు చేయాలి? అంశాలను నేర్చుకుంటే సరిపోతుంది. అదే విధంగా ముగింపు లెక్కల్లో వ్యవహారాల నమోదుపై అవగాహన అవసరం. సర్దుబాట్ల గురించి తెలుసుకోవాలి. పరీక్షకు ముందు గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. వీటి సహాయంతో ప్రిపరేషన్లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకోవాలి. -
సామాజిక అంశాలు- సమకాలీన సన్నద్ధత
వివిధ ఉద్యోగ నియామకాలకు టీఎస్పీఎస్సీ ఇటీవల నూతన సిలబస్‌ను విడుదల చేసింది. ఎప్పటి నుంచో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఔత్సాహికులకు దీంతో స్పష్టత వచ్చింది. ఈ క్రమంలో గ్రూప్-1, గ్రూప్-2లోని భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన అంశాలకు సంబంధించి సిలబస్‌కు అనుగుణంగా ఎలా తయారుకావాలి? ఎలాంటి వ్యూహం అనుసరించాలి? వంటి వాటికి అవసరమైన సూచనలు అందించే ప్రయత్నమే ఈ వ్యాసం... కొత్త పరీక్ష విధానంలో గ్రూప్-1 పరీక్షల్లో పాలిటీ, సామాజిక అంశాలకు సంబంధించి 150 మార్కులకు ప్రత్యేకంగా ఒక పేపర్ (పేపర్-3)ను ప్రవేశపెట్టారు. ఈ అంశాలకు గ్రూప్-2లోని పేపర్-2లో 100 మార్కులు కేటాయించారు. సిలబస్ స్వభావాన్ని కూడా మార్చారు. రాజకీయ అంశాలతో పాటు సామాజిక అంశాలు, సమస్యలను ఇందులో చేర్చారు. గ్రూప్-2లోని పేపర్-2లో రెండు, మూడు సెక్షన్లలో పాలిటీ, సామాజిక అంశాలను పొందుపరిచారు. రెండో సెక్షన్లో సాధారణంగా అన్ని పోటీ పరీక్షల్లో ఉండే భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలనా అంశాలను యథాతథంగా కొనసాగించారు. రాజ్యాంగం-మౌలిక అంశాలు: రాజ్యాంగం అంటే ఏమిటి? రకాలు, లక్ష్యాలు, భారత రాజ్యాంగం చారిత్రక వికాసం- బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణలు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి.రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులను సమగ్రంగా చదివి, వాటికి సంబంధించిన తాజా పరిణామాలను, సుప్రీంకోర్టు తీర్పులను తెలుసుకోవాలి. ఈ విభాగంలో ప్రకరణలను విస్తృతంగా గుర్తుంచుకోవాలి. సమాఖ్య పద్ధతి- కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు, నిర్మాణం, అధికారాలు, విభజన సమస్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వాటి వివాదాలను అధ్యయనం చేయాలి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ- నూతన పంచయితీ వ్యవస్థ; 73, 74వ రాజ్యాంగ సవరణలు, అధికార బదలాయింపు సంబంధిత అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి.భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, దిగువ కోర్టుల నిర్మాణం, న్యాయశాఖ క్రియాశీలత, న్యాయ ప్రవర్తన, తాజా వివాదాలను తెలుసుకోవాలి.ఎన్నికలు, ఎన్నికల సంఘం, ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల్లో అక్రమాలు-మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, రాజకీయ పార్టీలు, విధివిధానాలను విస్తృతంగా చదవాలి.సామాజిక న్యాయం, అణగారిన వర్గాలు, రాజ్యాంగ, చట్టపర రక్షణలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు, సదుపాయాలను తెలుసుకోవాలి.భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు... ముఖ్యంగా ఐక్యత, సమ్రగత, అవినీతి, మతతత్వం, కులతత్వం, తీవ్రవాదం, వ్యవస్థలు, రాజకీయ విలువల పతనం తదితర అంశాలను అధ్యయనం చేయాలి. సమాజ నిర్మాణం, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు: గత సిలబస్‌లోని సంక్షేమ యంత్రాంగం, సామాజిక న్యాయం అనే చాప్టర్ నుంచి చాలా అంశాలను యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త అంశాలను చేర్చారు.ముఖ్యంగా భారత సమాజ ముఖ్య లక్షణాలు, సామాజిక పరిణామాల్లోని కుటుంబం, వివాహం, బంధుత్వం, తెగలు, కులం, మతం వంటి అంశాలను పేర్కొన్నారు. వీటిని చదివే సమయంలో భారతీయ అంశాలకు పరిమితం కావాలి. సమాజ శాస్త్రంలో పాశ్చాత్య రచయితలు చెప్పిన నిర్వచనాలు, సాంకేతిక అంశాలను అధ్యయనం చేయనవసరం లేదు. సామాజిక సమస్యలైన కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, వరకట్నం, మహిళలపై హింస, బాలకార్మికుల సమస్య, మానవ అక్రమ రవాణా, పరువు హత్యలు వంటివి ముఖ్యమైనవి. వాటి చారిత్రక నేపథ్యం, కారణాలు, ప్రభుత్వ చర్యలు, పౌర సమాజం పాత్ర, వివిధ పరిమితులను క్షుణ్నంగా తెలుసుకోవాలి. సాంఘిక ఉద్యమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతాంగ పోరాటాలు, గిరిజన తిరుగుబాట్లు, దళిత, అణగారిన వర్గాల అస్తిత్వ ఉద్యమాలు, పర్యావరణ, మహిళా ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు వంటి అంశాలపై స్వాతంత్య్రానికి ముందు తర్వాత పరిణామాలను తెలుసుకోవాలి. ప్రభుత్వ విధానాలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి.తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకించి కొన్ని సామాజిక, ఆర్థిక సమస్యలున్నాయి. వెట్టి, జోగిని, దేవదాసీ, ఫ్లోరోసిస్, వలసలు, చేనేత కార్మికుల సమస్యలను తెలంగాణలోని ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలి. ప్రభుత్వ విధానాలు: ప్రభుత్వ అధికారిగా నియమితులయ్యే వారికి తన చుట్టూ ఉన్న సమాజం స్థితిగతులపై స్పష్టమైన అవగాహన, ఆయా వర్గాల ప్రజల పట్ల సామాజిక స్పృహ కలిగి ఉండాలన్న ఉద్దేశంతో సిలబస్‌ను రూపొందించారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభివృద్ధికి, వికాసానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి.కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యన్నతి కోసం దాదాపు 200 పథకాలను అమలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఎన్డీయే ప్రభుత్వం చాలా కొత్త పథకాలను ప్రారంభించింది.బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు.. ముఖ్యంగా మిషన్ కాకతీయ, గ్రామజ్యోతి, గ్రామ ప్రగతి, హరితహారం, మన ఊరు-మన ప్రణాళిక, కల్యాణజ్యోతి, ఆసరా, సింగిల్ విండో పారిశ్రామిక విధానం, ఐటీ కారిడార్ తదితర అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ప్రిపరేషన్ మెలకువలు- జాగ్రత్తలు: ప్రతి పేపర్ సిలబస్‌ను సవివరంగా ఇచ్చారు. కాబట్టి ఏది చదవాలి? ఏది చదవకూడదు? అనే సందిగ్ధతకు ఆస్కారం లేదు. ఒక పేపర్లోని అంశాలకు, మరో పేపర్లోని అంశాలకు అంతర్గత సంబంధం ఉంది. ఉమ్మడి అంశాలను గుర్తించి, ప్రిపరేషన్ కొనసాగించాలి. సిలబస్ విస్తృతంగా, పరిధి ఎక్కువగా ఉందనే ఆలోచన అనవసరం. పోటీ పడుతున్న అభ్యర్థులందరికీ ఇదే పరిస్థితి ఉంటుందని గుర్తించాలి. మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకాన్నీ చదవద్దు. రచయిత, పోటీ పరీక్షల బోధన అనుభవం, పబ్లికేషన్ ప్రాధాన్యత ఆధారంగా పుస్తకాలను పరిశీలించండి. సిలబస్‌లోని ప్రతి అంశానికి తాజా పరిణామాలను జోడించి చదవాలి. ఫ్యాక్ట్స్‌ను గుర్తుంచుకునేందుకు ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. రాజ్యాంగంలోని ప్రకరణలను కంఠతా చేయాల్సిన అవసరం లేదు. సందర్భానుసారం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆత్మ విశ్వాసంతో ప్రారంభించాలి.. నిరంతరం శ్రమించాలి... ప్రిపరేషన్ విధానాన్ని సమీక్షించుకోవాలి.. తప్పులను సరిదిద్దుకొని, ఉత్సాహంతో ముందుకెళ్లాలి.. విజయం తథ్యం. సమాజ నిర్మితి, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు విభాగంలో మాదిరి ప్రశ్నలు 1. ఈ కింది వాటిలో ఏది భారత సామాజిక నిర్మితి కాదు? 1) అంచెలతో కూడిన సామాజిక అసమానతలు 2) పరాయీకరణ 3) ఆసక్తి, అభిరుచి ఆధారిత వృత్తులు 4) ఏవీకాదు 2. వివాహ వ్యవస్థకు సంబంధించి సరైన అంశం? 1) వివాహం ఒక సాంస్కృతిక సంశ్లిష్టత 2) విశ్వజనీన మానవ సమాజానికి ఆధారం 3) ఒక రకమైన పరిచయం 4) 1, 2 3. వరకట్న నిషేధ చట్టం సక్రమంగా అమలు కాకపోవటానికి కారణం? 1) చట్టంలో స్పష్టత లేకపోవడం 2) చట్టం పురుషుని అంతస్థును తగ్గిస్తుంది 3) సామాజిక ఆమోదం లేకపోవడం 4) పైవేవీ కాదు 4. కుటుంబం విశిష్ట లక్షణం కానిది? 1) ప్రాథమిక యూనిట్ 2) సార్వజనీనమైనది 3) సాంఘికీకరణ సాధనం 4) పైవేవీ కాదు 5. {V>Ò$-×-నగర వలస పర్యావసానంగా ఏ ఫలితాలు కనిపిస్తాయి? 1) తలసరి ఆదాయం పెరగటం 2) జీవన ప్రమాణాలు కొంత మేరకు పెరగటం 3) ఉద్యోగావకాశాలు పెరగటం 4) పైవన్నీ 6. సమాన అవకాశాలు అందుబాటులో ఉండటం అంటే ఏమిటి? 1) అందరికీ ఒకేరకమైన ఆదాయం ఉండటం 2) సమాన పనికి సమాన వేతనం 3) సమాన ప్రతిభ, అర్హతలు ఉన్నవారిపై వివక్ష చూపించకపోవటం 4) అందరికీ ఉపాధి కల్పించటం 7. సామాజిక ఉద్యమాలు అనేవి? 1) సమష్టి చర్య 2) సంఘర్షణారూపం 3) వైయక్తిక ప్రవర్తనా రూపం 4) ధిక్కార స్వభావ రూపం 8. తెలంగాణ రైతాంగ ఉద్యమం గురించి కింది వాటిలో సరైంది? 1) భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, నిజాంకు వ్యతిరేకంగా జరిగింది 2) పేద రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు మొదటి నుంచి చివరి వరకు పాల్గొన్నారు 3) గొరిల్లా పద్ధతిలో జరిగిన అతిపెద్ద పోరాటం 4) అన్నీ సరైనవే 9. కింది వాటిలో సరిగా జతపరచనిది? 1) శరద్‌జోషి - షేట్కారీ సంఘటన్ 2) భారతీయ కిసాన్ యూనియన్ - మహేందర్‌సింగ్ తికాయిత్ 3) ఆచార్య ఎన్జీరంగా - అఖిల భారత కిసాన్ సభ 4) కర్ణాటక కిసాన్ సభ - ప్రొఫెసర్ నంజుండప్ప 10. షెడ్యూల్డ్ తెగలను గుర్తించటానికి ప్రాతిపదిక కానిది? 1) ఆర్థిన వెనుకబాటు 2) భౌగోళిక ఐసోలేషన్ 3) ప్రత్యేక లక్షణాలు 4) లిపిలేని భాష 11. ఒక వ్యక్తి జీవితంలో వివిధ వివక్షతలు వివిధ దశల్లో ప్రవేశిస్తాయి. ఏ వివక్షత మాత్రం పుట్టుక ముందే ప్రవేశిస్తుంది? 1) కుల వివక్షత 2) లింగ వివక్షత 3) మత వివక్షత 4) ఏవీకాదు 12. బాల కార్మిక వ్యవస్థకు కారణం? 1) పేదరికం 2) అధిక సంతానం 3) సామాజిక ఆమోదం 4) పైవన్నీ 13. సమకాలీన సమాజంలో సామాజిక సంఘర్షణలు తలెత్తటానికి కారణం? 1) వైయక్తికవాదం 2) సామాజిక ఆమోదం 3) పరిణిత ప్రవర్తన లేకపోవటం 4) పైవన్నీ 14. {V>Ð]l$-gZÅతి కార్యక్రమానికి సంబంధించి సరైన అంశం? 1) మన ఊరు - మన ప్రణాళిక కార్యక్రమానికి కొనసాగింపు 2) గ్రామ పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించి, వాటిని బలోపేతం చేయటం 3) విధులు, నిధులు పరమైన వివిధ అంశాలను సమ్మిళితం చేసి, అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయటం 4) పైవన్నీ సరైనవే 15. రక్షిత వివక్షత, వితరణ న్యాయానికి రాజ్యాంగంలోని స్థానం? 1) ప్రత్యక్షంగా ఉంది 2) పరోక్షంగా ఉంది 3) సందర్భానుసారంగా ఉంది 4) ఎలాంటి ప్రస్తావనా లేదు సమాధానాలు 1) 3 2) 4 3) 3 4) 4 5) 4 6) 3 7) 1 8) 4 9) 4 10) 4 11) 2 12) 4 13) 4 14) 4 15) 1 -
మోసగాళ్ల మాటలు నమ్మొద్దు: టీఎస్పీఎస్సీ
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలిచ్చే మోసగాళ్లను నమ్మవద్దని, నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకై నిర్వహించే పరీక్షల్లో టీఎస్పీఎస్సీ నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరిస్తుందని కమిషన్ కార్యద ర్శి పార్వతి సుబ్రమణియన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసేవారి వివరాలను vigilance@tspsc.gov.inఈమెయిల్ ఐడీకి పంపాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.