
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నీళ్లల్లో వేసినట్లేనని, రాష్ట్రంలో ఆ పార్టీ ఖాళీ అవుతోందని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం నగరం లోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు టీఆర్‌ఎస్, బీజేపీల్లో చేరుతున్నారని, రాష్ట్రంలో ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయమన్నారు.
అర్వింద్ ఫౌండేషన్ ద్వారా 112 మంది చిన్నారుల ప్రాణాలు కాపాడే అదృష్టం కలిగిందన్నారు. ఈనెల 25న ఆర్మూర్‌లో జరిగే బహిరంగసభలో పసుపు రైతులకు తీపి కబురు అందనుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. కేం ద్ర ప్రభుత్వం ఐదేళ్లలో అమల్జేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ బస్టాండ్ వెనకాలగల మైదానంలో ఈనెల 25న సాయంత్రం 5 గంటలకు బీజే పీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సభకు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరీ, జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ హాజరుకానున్నారన్నారు.రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు యెండల లక్ష్మీనారాయణ, సీనియర్‌నాయకులు లోక భూపతిరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బస్వా లక్ష్మీనర్సయ్య, గీతారెడ్డి, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.