
డబుల్... గుబుల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకానికి అడుగడుగునా ఆటంకాలు ....
మంజూరైన ఇళ్లు 5,200..దరఖాస్తులు 82,282
ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు.. నేతల పైరవీలు
క్లిష్టతరంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
5వరకు టెండర్లు.. కాంట్రాక్టర్ల వెనుకంజ
నిరుపేదల్లో ఆందోళన... పలుచోట్ల నిరసనలు
ముకరంపుర : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నారుు. లబ్ధిదారుల ఎంపిక, స్థలాల గుర్తింపు, టెండ రు ప్రక్రియలో జాప్యం, గందరగోళం కారణంగా ఈ పథకం ప్రగతి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. జిల్లాలోని 13 నియోజకవర్గాలకు కలిపి 5200 ఇళ్లు మంజూరయ్యూరుు. ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్లను కేటారుుంచారు. వీటికోసం 186 గ్రామాలను ఎమ్మెల్యేలు ఎంపిక చేయగా, జిల్లావ్యాప్తంగా 82,282 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో ఇంటికి 16 మంది పోటీ పడుతున్నారు. జిల్లాకు మంజూరైన ఇళ్ల సంఖ్యకు సుమారు పదహారు రెట్లు అధికంగా దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికితోడు ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్ల వల్ల అధికారులకు తలనొప్పి తప్పడం లేదు. ఓవైపు పైరవీలు.. మరోవైపు తీవ్రమైన పోటీ కారణంగా తమను ‘డబుల్’ అదృష్టం వరిస్తుందో... లేదోననే బెంగ నిరుపేదలకు పట్టుకుంది. నియోజకవర్గాల వారీగా అర్హుల జాబితాలను కలెక్టర్‌కు అందించేందుకు గడువు ఎప్పుడో ముగిసినా... దరఖాస్తుల పరిశీలన, గ్రామసభలు పూర్తికాలేదు.
ఇప్పటివరకు 30శాతం గ్రామాల్లో సభలు నిర్వహించినా... పైరవీలు, ఫిర్యాదుల వల్ల లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి రాలేదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో డివిజన్/వార్డు సభలు ఇంకా మొదలే కాలేదు. కరీంనగర్, జగిత్యాల, వేములవాడ నియోజవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ నెల 2వరకు సభలను పూర్తి చేసి 3న కలెక్టర్‌కు లబ్ధిదారుల జాబితాలను సమర్పించాల్సి ఉండగా, సాధ్యం కాలేదు. పోటీ ఎక్కువగా ఉండటంతో నిరుపేదలు, సామాజిక వర్గాల పరంగా లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయూలనేది నిబంధన. అరుుతే పలుచోట్ల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సూచించిన వారి పేర్లును జాబితాలో చేర్చారంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నారుు. వాస్తవానికి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి నేతల వరకు ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు పైరవీలు చేయడంతో లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించింది.
దీంతో ఈనెల 10న తుది జాబితాను కలెక్టర్‌కు అందించాల్సి ఉండగా.. ఇప్పటికీ అధికారులు తర్జనభర్జన పడుతుండటం గమనార్హం. మరో పదిరోజుల పాటు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, ఆ తర్వాత సభలు నిర్వహించి, మార్చి నెలాఖరు వరకు లబ్ధిదారుల జాబితాలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
నిర్మాణాలు ఎప్పటికో...?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తయ్యేనో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ కాస్ట్‌తో 560 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. గ్రామాలకు 240, పట్టణాలకు 160 చొప్పున ఇళ్లను కేటాయించారు. యూనిట్ కాస్ట్ గ్రామాల్లో రూ.5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణరుుంచారు. ప్రభుత్వం సూచించిన నమూనాలో ఒక్కో ఇంటి నిర్మాణానికి కనీసం రూ.10 లక్షలు ఖర్చవుతుందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఆయా నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం ఈ నెల 29 నుంచి టెండర్లు ఆహ్వానించారు. మార్చి 5వరకు టెండర్ దాఖలుకు గడువు విధించారు. ఈ టెండర్ ప్రక్రియ పూర్తరుు, ఇళ్ల నిర్మాణాలు చేయడానికి ఎంతకాలం పడుతుందో వేచిచూడాల్సిందే.
సీఎం దత్తత గ్రామంలోనూ ఇదే దుస్థితి...
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌లోనూ డబుల్ బెడ్‌రూం పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఎం హామీతో దాదాపు 220 మంది కుటుంబాలు తమ ఇళ్లను కూల్చివేసుకుని డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ గ్రామానికి 247 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసి నాలుగు నెలలు గడిచినా నేటికీ ప్రారంభం కాలేదు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికి మూడు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడం విశేషం.
ఈ విషయమై హౌసింగ్ పీడీ నర్సింహరావు మాట్లాడుతూ... ఎంపిక చేసిన గ్రామాల్లో సగం వరకు గ్రామసభలు పూర్తయ్యాయని, అర్హులైన లబ్ధిదారుల తుదిజాబితా మరో పది రోజుల్లో పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సతీష్ పింగళి మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల కోసం ఈనెల 19న నియోజకవర్గాల వారీగా టెండర్లు ఆహ్వానించి, మార్చి 5న టెండర్లు క్లోజ్ చేస్తామని, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వేగవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
సర్కారు న్యాయం చేయూలె
నాకు నాలుగురు బిడ్డలు. చిన్న బిడ్డకు పోలియో. ఇళ్లు కవర్లతో కట్టుకొని కంపువాసనలో బతుకుతున్నం. పైసలు తీసుకుంటూ పైరవీలు చేసోటళ్లతో మాలాంటోళ్లకు అన్యాయం చేయొద్దు. మాకు ఖాళీ జాగ ఉంది కానీ ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. సర్కార్ డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయాలే. - వరికుప్పల సోమక్క, జమ్మికుంట
కవర్ల కింద బతుకుతున్నం
మాకు స్థలం లేదు, ఇల్లు లేదు. ముప్పయ్ ఏండ్ల సంది ఖాళీ స్థలాల్లో కవర్లు కప్పుకొని బతుకుతున్నం. మాలాంటోళ్ల డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టియ్యాలే. నా భర్త మారయ్య చనిపోరుుండు. బిడ్డకు గుండెజబ్బు. కొడుకు పొద్దంతా ట్రాలీ నడిపితే వచ్చే కూలీతోనే బతుకుతున్నం.
- తుర్పాటి సమ్మక్క, జమ్మికుంట