జిల్లాపరిషత్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్‌జీఎఫ్) పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.32.47కోట్లతో రూపొందించిన ప్రణాళికలను జిల్లా ప్రణాళిక కమిటీ ఆమోదించింది. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం కమిటీ చైర్మన్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన సమన్వయ కార్యదర్శి, కలెక్టర్ జి.కిషన్ నేతృత్వంలో డీపీసీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీఆర్‌జీఎఫ్ నిధులు మంజూరయ్యాయని, ఇందుకనుగుణంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు.
నిధుల్లో 50శాతం పంచాయతీలకు, 30శాతం మండల పరిషత్‌లకు, 20శాతం జిల్లా పరిషత్‌కు కేటాయిం చామని, ఆయా స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు ప్రతిపాదించిన పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం హడావుడిగా నిర్వహించడం సరికాదన్నారు. డీపీసీకి చట్టబద్ధమైన కమిటీ ఉన్నదన్నారు.
స్థానిక సంస్థల నుంచి డీపీసీ సభ్యులు లేకున్నా, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నప్పటికీ... ప్రణాళికల రూపొందించిన సమయంలో ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు, ముఖ్యంగా వరంగల్ కార్పొరేషన్ నుంచి ఎంపీలుగా సభ్యులమైన తమకు ప్రతి పాదనల విషయం ఎందుకు చెప్పలేదని కలెక్టర్‌ను అడిగారు. సమయాభావం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని కలెక్టర్ కిషన్ సమాధానమిచ్చారు. నిధులు మురిగిపోతాయన్న కారణంగా ఈ ప్రతిపాదనలను ఆమోదించాల్సి వస్తోందని శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ సీతారాంనాయక్ మా ట్లాడుతూ డీపీసీ సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణీత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికలన్నీ తయారు చేసి ఆమోదించాలని డీపీసీ ముందు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన డీపీసీ సమావేశమని సమాచారం ఇచ్చారని, ఆ తర్వాత 24, మళ్లీ 29న నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సమావేశాలను వాయిదా వే సేందుకు వీలు లేదని, దీనికి పద్ధతి ఉంటుందన్నారు. వరంగల్ కౌన్సిల్‌లో ఏం పనులు ప్రతిపాదించారో తెలియదు. మండల పరిషత్‌లలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు గొడవలు జరుగుతున్నాయి.
వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. తప్పనిసరి అనడంతో డీపీసీలో ప్రణాళికలకు ఆమోదిస్తున్నామన్నారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి, డీపీసీ సభ్యులు బూర ముత్తిలింగం, రావుల రవిచందర్‌రెడ్డి, జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. డీపీసీ నిర్వహణ తేదీపై తగిన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం వల్ల తాము హాజరు కాలేక ోయామని, ఇలా ఎందుకు చేశారంటూ ఎంపీ గుండు సుధారాణీ, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ను ప్రశ్నించారు.
బీఆర్‌జీఎఫ్ ప్రణాళికలకు డీపీసీ ఆమోదం
Published Tue, Sep 30 2014 1:42 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement