కొన్ని రకాల కలుపు మందులు విత్తనం వేసిన వెంటనే గానీ, మొలకెత్తక ముందు గానీ పిచికారీ చేయాలి. ఉదాహరణకు పెండిమిథాలిన్, అల్లాకోర్ మొదలైనవి. ఈ రకం మందులను స్ప్రే చేసే సమయంలో నేలలో తగినంత తేమ ఉంటే బాగా పనిచేస్తాయి. కొన్ని రకాల కలుపు మందులు పైరు, కలుపు మొలకెత్తిన తర్వాత తర్వాతనే పిచికారీ చేయాల్సి ఉంటుం ది. ఇమాజతాఫైర్, ఫినాక్సాప్రాప్, పి ఇథైల్ ఈ కోవలోకి చెందినవి. ఈ మందులను వేరుశనగ, మినుము, పెసర పైర్లు విత్తిన 15-20రోజుల తర్వాత పిచికారీ చేయాలి. అప్పటికీ కలుపు మొలిచి ఉంటుంది. పైరు విత్తిన వెంటనే వీటిని స్ప్రే చేస్తే ఉపయోగం ఉండదు.
కలుపు మందులను తేలికపాటి (ఇసుక, గరప) నేలల్లో తక్కువ మోతాదులోనూ, నల్లరేగడి భూముల్లో ఎక్కువ మోతాదులో, ఎర్ర నేలల్లో మధ్యస్తంగా వాడుకోవాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కలుపు మందులను పిచికారీ చేయొద్దు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్ప్రే చేయడం తప్పదు. సాధ్యమైనంతవరకు రైతులు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ పర్యావరణ పరిరక్షణతోపాటు అధిక దిగుబడులను సాధించవచ్చు.
కలుపు మొక్కలు...
బంగారుతీగ(మినుము మరియా లూసర్న్ గడ్డి): దీని నివారణకు లీటరు నీటిలో 5 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ (స్టాంప్, పెండిగార్డ్, పెండిస్టార్)ను విత్తనం వేసిన 48 గంటలోలపు పిచికారీ చేయాలి.
లీటర్ నీటిలో 1.5మిల్లీలీటర్ల ఇమాజతాఫైర్ (పర్‌స్యూట్, ధీనామజ్, లగాన్) మందును కలిపి విత్తనం వేసిన 15-20 రోజుల మధ్యలో పిచికారీ చేయాలి.
జొన్నమల్లె...
దీని నివారణకు 5నుంచి 7గ్రాముల 2, 4-డి సోడియం ఉప్పు(ఫెర్నాక్సోన్, సాలిక్స్) మందును కలిపి జొన్నమల్లెపై పడేలా పిచికారి చేయాలి.
తుంగ లాంటి మొండి జాతి కలుపు మొక్కలు...
భూమిని దున్నక ముందు గానీ, లేదా మొదటి పంట తర్వాత రెండో పంట వేయకముందు చేపట్టాల్సిన
పద్ధతులు..
తుంగ మరియ ఇతర కలుపును 15-20 రోజుల వరకు పెరగనీయాలి.
అవసరమైతే నీటిని పారబెట్టి త్వరగా పెరిగెలాచేయాలి.
కలుపు బాగా పెరిగిన తర్వాత లీటరు నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ మందును కలిపి స్ప్రేచేయాలి.
10-15రోజులు ఆగి కలుపు చనిపోయిన తర్వాత దున్నితే తుంగను కొంతవరకు నివారించవచ్చు. ఈ విధంగా మూడుసార్లు చేస్తే తుంగ మొదలగు మొండి కలుపు తగ్గుముఖం పడుతుంది.
సులభంగా కలుపు తీసేద్దాం
Published Sun, Sep 7 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement