Glyphosate
-
గ్లైఫోసేట్పై దేశవ్యాప్త నిషేధం అత్యవసరం
గ్లైఫోసేట్.. ఇది కలుపును చంపే విష రసాయనం. దీన్ని చల్లితే కలుపుతో పాటు నేలపై ఉన్న అన్ని రకాల మొక్కలూ చనిపోతాయి. కలుపు తీయాలంటే కూలీలకు ఖర్చు అధికమవుతోందని గ్లైఫోసేట్ మందును చల్లుతున్నారు. కానీ, ఆరోగ్యం చెడిపోతే, చికిత్సకు ఇంకా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది అని రైతులు గ్రహించడంలేదు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా గ్లైఫోసేట్ ఉపయోగం మీద కొంత కాలం పాటు ఆంక్షలు విధిస్తున్నది. సాధారణంగా, పత్తి పంట కాలం అయిన జూన్ నుంచి అక్టోబర్ వరకు గ్లైఫోసేట్ అమ్మకాల మీద ఆంక్షలు పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా ఒకసారి ఆంక్షలు విధించాయి. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే క్రమం తప్పకుండా 2018 నుంచి ప్రతి ఏటా ఆంక్షలు ప్రకటిస్తున్నది. అయితే, దురదృష్టవశాత్తూ, ఈ ఆంక్షల అమలు మాత్రం ఆశించిన మేరకు లేదు. ప్రతి ఏటా గ్లైఫోసేట్ అమ్మకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. దుకాణాలలో ఈ డబ్బాలు దొరుకుతూనే ఉన్నాయి. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం చట్టవిరుద్ధమైన బీజీ–3 పత్తి విత్తనాలను మన దేశంలో అక్రమంగా ప్రవేశపెట్టారు. కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వీటి విస్తృతిని నివారించి, బాధ్యులమీద క్రిమినల్ చర్యలు చేపట్టలేదు. గ్లైఫోసేట్ అనేది పరాన్నజీవి వ్యవసాయ రసాయన ఉత్పాదన. జన్యుమార్పిడి విత్తనాల సాంకేతిక పరిజ్ఞానంపై స్వారీ చేస్తుంది. కలుపు రసాయనాలను తట్టుకునే విధంగా జన్యుమార్పిడి చేసిన (హెచ్.టి. బీటీ–3) అక్రమ పత్తి విత్తనాలతోపాటు గ్లైఫోసేట్ అమ్మకాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. పైగా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా చట్ట వ్యతిరేక బీజీ–3 పత్తి విత్తనాల మార్కెట్ 40 శాతానికి పెరిగిందని ఒక అంచనా. కేంద్రం చేతుల్లోనే అధికారం విత్తనాలను మార్కెట్ చేస్తున్న కంపెనీల మీద చర్యలు చేపట్టే ఉద్దేశం లేకపోవడంతో, మధ్యేమార్గంగా గ్లైఫోసేట్ను నియంత్రించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సు చేసింది. ఆ విధంగా గ్లైఫోసేట్ మీద ఆయా రాష్ట్రాల్లో కొద్ది నెలల పాటు ఆంక్షలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా గ్లైఫోసేట్ను నియంత్రించవచ్చు. అది అత్యంత ప్రమాదకారి అనుకుంటే నిషేధించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ‘మీకు అవసరం అనిపిస్తే నియంత్రించండి’ అని రాష్ట్రాలకు చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, పురుగు మందుల నియంత్రణ చట్టం కింద తన కున్న అధికారాలను, బాధ్యతలను నిర్లక్ష్యం చేసింది. పనిచేయని తాత్కాలిక ఆంక్షలు ఎనిమిదేళ్ల్ల క్రితం మన దేశంలో గ్లైఫోసేట్ పెద్దగా ఎవరికీ తెలియదు. చట్టపరంగా అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాల రాకతో దీని అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. వీటి వాడకాన్ని అరికట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలిపెట్టింది. గ్లైఫోసేట్ ఉపయోగం మీద ఏటా కొద్ది నెలలు ఆంక్షలు పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తర్వులు జారీ చేస్తున్నది. కాగా, ఈ వ్యూహం పని చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా పురుగు మందును, పురుగు మందుల నియంత్రణ చట్టం–1968 ఉపయోగించి 60 రోజుల వరకు నిషేధించవచ్చు. పూర్తిగా నిషేధించే అధికారాలు మటుకు లేవు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పూర్తిగా, శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. అయితే, కేరళ, సిక్కిం రాష్ట్రాల మాదిరి కొన్ని అధికరణాల ద్వారా రాష్ట్రాలకు అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం ఆ విధంగానే ఇదివరకు ఎండోసల్ఫాన్ మీద చర్యలు చేపట్టింది. గ్లైఫోసేట్ మీద కూడా పూర్తి నిషేధం అక్కడ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇచ్చిన ఉత్తర్వులలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. ప్రతి ఏటా ఆంక్షల తీవ్రతను నీరుగార్చే మార్పులు జరుగుతున్నాయి. పంట ఉన్న ప్రాంతంలో వాడవద్దు (జూన్ – అక్టోబర్ వరకు), పంట లేని ప్రాంతంలో వాడవచ్చు, విస్తరణ అధికారి నుంచి తీసుకున్న పత్రం ప్రకారమే అమ్మాలి, విస్తరణ అధికారులు గ్లైఫోసేట్ ఉపయోగాన్ని అరికట్టాలి.. వంటి ఆచరణ సాధ్యం కాని ఆంక్షలు ఈ ఉత్తర్వుల్లో ఉన్నాయి. ఆచరణాత్మక ప్రణాళికేదీ? తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఒక ఆచరణాత్మక ప్రణాళిక జిల్లాల వారీగా తయారు చేసి ఉండవచ్చు. 2018 ఉత్తర్వులలో పురుగు మందుల విక్రయదారులకు ఇచ్చే లైసెన్స్‌లో గ్లైఫోసేట్ పదాన్ని తొలగించాలన్నారే గానీ దాన్ని అమలు చేయలేదు. 2019లో ఆ పదాన్నే తీసివేశారు. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా అనేక సూచనలు ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. మన దేశంలో గ్లైఫోసేట్ ప్రభావంపై అధ్యయనాలు లేవు. అనేక గ్రామాలలో రైతులు పత్తి చేలల్లో గ్లైఫోసేట్ చల్లితే పంటంతా మాడిపోయిన ఉదంతాలు ఉన్నాయి. గ్లైఫోసేట్ వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. దీని ప్రధాన తయారీదారు అయిన బేయర్ కంపెనీ (ఇది వరకు మోన్సాంటో) మీద అమెరికాలో అనేక నష్ట పరిహారం కేసులు వేశారు. దేశవ్యాప్త నిషేధమే మార్గం చట్టవిరుద్ధమైన కలుపు మందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నంత కాలం తాత్కాలిక ఆంక్షలు పని చేయవు. ముందుగా బీజీ–3 విత్తనాల తయారీదారుల మీద, విక్రయదారుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. రైతులు, గ్రామీణుల ఆరోగ్య రక్షణకు, ఆర్థిక, పర్యావరణ కారణాల రీత్యా కూడా గ్లైఫోసేట్ తయారీ, దిగుమతి, ఎగుమతి, వాడకంపై కేంద్రం దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించడం తక్షణ అవసరం. - డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త: ప్రముఖ విధాన విశ్లేషకులు ఈ–మెయిల్: nreddy.donthi20@gmail.com -
విచ్చలవిడిగా 'గ్లైపోసేట్' అమ్మకాలు
సాక్షి, అమరావతి : ఇదో కలుపు నివారణ మందు. పేరు గ్లైపోసేట్. అన్ని మందుల లాంటిది కాదిది. భస్మాసురహస్తం. కలుపే కాదు.. ఇది పడినచోట పచ్చగడ్డి మాడిమసైపోవాల్సిందే. కలుపుతోపాటు మానవాళికి మేలుచేసే క్రిమికీటకాదులు కూడా కనిపించకుండా పోతాయి. పిచికారీ చేసేవాళ్లకు కూడా తీవ్రనష్టం కలిగిస్తుంది. అనారోగ్యాలపాలు చేస్తుంది. వాస్తవానికి ఇది నిషేధిత పురుగుమందుల జాబితాలో ఉంది. అయినా సరే రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్టు పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ చెబుతోంది. పలువురు పర్యావరణ ప్రముఖులు, సంస్థల వారు కూడా నిజమేనంటున్నారు. టీ తోటల్లో ఎక్కువగా పెరిగే కలుపు నివారణకు కేంద్రం అనుమతి ఇచ్చిన ఈ మందు వినియోగం తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇంతకీ ఏమిటీ గ్లైపోసేట్.. కలుపును తట్టుకునే విత్తనాలతో కలిపి వాడే ఆగ్రో కెమికల్ ఇది. ఇతర కలుపు నివారణ మందులకు, దీనికి చాలా తేడా ఉంది. ఈ మందును రౌండప్ అని, గ్లైసిల్ అని కూడా అంటారు. దీని దుష్ప్రభావాలను గుర్తించి.. ఈ మందు పుట్టిన అమెరికాలోనే దీని వాడకం నిషేధించారు. అయినా ఆసియా దేశాల్లో మాత్రం ఎక్కువగా వినియోగిస్తున్నారు. టీ తోటల్లో కలుపు నివారణ కోసం వచ్చిన ఈ మందును ఇప్పుడు జన్యుమార్పిడి విత్తనాలను వాడే పత్తి, మొక్కజొన్న, వంగ, మిర్చి, కాకర, అరటి, అక్కడక్కడా వరిచేలల్లో కూడా వాడుతున్నారు. చివరకు కలుపును తట్టుకుంటాయనే పేరిట వచ్చిన పత్తి రకాల సాగులోనూ వినియోగిస్తున్నారు. ఈ మందు చెడు ప్రభావాన్ని గుర్తించి ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు దీన్ని నిషేధించాయి. అక్రమంగా విక్రయిస్తున్న సంస్థల లైసెన్సులు రద్దుచేశాయి. వాడితే వచ్చే ముప్పు.. - గ్లైపోసేట్ వాడడం వల్ల మనుషులకు, మొక్కలకు, పశువులకు కూడా ముప్పని పర్యావరణవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. - ఈ మందు వాడిన పొలాల్లోని గడ్డి తిని పశువులు చనిపోయినట్టు పాన్ ఇండియా సర్వేలో తేలింది. - ఈ మందును పిచికారీ చేసిన వారిలో అనేకమంది రైతులు క్యాన్సర్, కిడ్నీ, ఛాతీ వ్యాధులకు గురయ్యారు. వీరిలో కొందరు మరణించగా కొందరు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితిని గమనించారు. - గ్లైపోసేట్ వాడినా పత్తి చేలల్లో గులాబీరంగు పురుగు ఉద్ధృతమైనట్టు పరిశీలనలో తేలింది. - దేశంలో 35 సంస్థలు ఈ మందును తయారుచేస్తున్నాయి. 2018–19లో 6,684 మెట్రిక్ టన్నుల గ్లైపోసేట్ తయారైనట్టు వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకటించింది. - నకిలీ లేబుల్స్ లేదా అసలు లేబుళ్లు లేకుండా కూడా గ్లైపోసేట్‌ను నిషేధిత రాష్ట్రాల్లోకి రవాణా చేస్తున్నారు. - లీటర్ మందును రెండు వేల నుంచి 2,500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఎలా నిరోధించాలి? పర్యావరణానికి, పశుసంపదకు, మానవజాతికి తీవ్ర హాని కలిగిస్తున్న గ్లైపోసేట్‌ను దేశంలో పూర్తిగా నిషేధించాలని వ్యవసాయరంగ ప్రముఖులు కోరుతున్నారు. ఈ మందు తయారీని దశల వారీగా ఆపేయాలని పర్యావరణవేత్తలు కేంద్ర వ్యవసాయ, రైతుసంక్షేమ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి విషతుల్యమైన మందులకు బదులు సేంద్రియ పద్ధతుల్లో కలుపును నివారించే మందుల తయారీపై దృష్టిసారించాలని జాతీయ సేంద్రియ సాగు సంస్థకు సిఫార్సు చేశారు. ప్రకృతి సాగు ప్రోత్సాహమే పరిష్కారం గ్లైపోసేట్ వాడకాన్ని టీ తోటలకే పరిమితం చేయాలి. మిగతా పంటల్లో వాడకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించాలి. ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ అనుకూల ప్రకృతి సాగు పద్ధతులు అనేకం అమల్లో ఉన్నాయి. వాటిని రైతుల్లోకి తీసుకువెళ్లేలా వ్యవసాయశాఖ కృషిచేయాలి. కలుపు నివారణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటి ప్రకృతి సేద్యం. బహుళజాతి కంపెనీల దురాశ ఫలితమే గ్లైపోసేట్. దాన్ని ఏ రూపంలో ఉన్నా నిషేధించాల్సిందే. - డాక్టర్ డి.నరసింహారెడ్డి, పర్యావరణరంగ ప్రముఖుడు యాంత్రీకరణ పద్ధతులు ఉపయోగించాలి కలుపు నివారణ పేరిట కొందరు రైతులు దొంగచాటుగా గ్లైపోసేట్ తెచ్చి పత్తి చేలల్లో వాడుతున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. రూ.60, రూ.70 కూలి ఎక్కువ అని ఈ మందు వాడితే సాగుకు మేలుచేసే మిత్రపురుగులు కూడా చచ్చిపోతున్నాయి. దానికి బదులు కలుపు నివారణకు చిన్న యంత్రాలను వినియోగించడం మేలు. అప్పుడు రైతుల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. చిన్న యంత్రాలు ఆర్బీకేలలో కూడా అందుబాటులోకి రానున్నాయి. - వి.భరత్‌రెడ్డి, తలముడిపి, కర్నూలు జిల్లా ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం రాష్ట్రంలో గ్లైపోసేట్‌పై నిషేధం ఉంది. ఇక్కడ టీ తోటలు లేనందున ఆ మందు వాడడానికి వీల్లేదు. అనుమతి లేని ఆ మందును ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. రైతులు తమకు కావాల్సిన నాణ్యమైన పురుగుమందులు, ఎరువులు, క్రిమిసంహారక రసాయనాలను ఆర్బీకేల ద్వారా తెప్పించుకోవచ్చు. – హెచ్.అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ -
పేరుకే నిషేధం!
సాక్షి, హైదరాబాద్: బీజీ–3 పత్తి (హెచ్‌టీ) విత్తనంపై నిషేధం అమలు తూతూమంత్రంగా సాగుతోంది. దీన్ని వినియోగిస్తే కేన్సర్ వ్యాధి వస్తుందని తెలిసినా.. విచ్చలవిడిగా మార్కెట్లో ఈ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వచ్చేనెల నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుతుండటంతో మళ్లీ రైతులకు వీటిని కట్టబెట్టేందుకు దళారులు సిద్ధమయ్యారు. బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి తేడా గుర్తించని స్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని అక్రమదందాకు తెరలేపారు. రెండు మూడేళ్లుగా ఇదే తీరులో బీజీ–3 పత్తి విత్తనాన్ని గ్రామాల్లో పండిస్తున్నప్పటికీ.. అడ్డుకోవడంలో వ్యవసాయశాఖ ఘోరంగా విఫలమైంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణలో 15% బీజీ–3 పత్తి సాగైంది. అనధికారికంగా చూస్తే దాదాపు 25% సాగవుతుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో సాగవుతున్నా వ్యవసాయశాఖ తూతూమంత్రపు చర్యలకే పరిమితమైంది. ఈ రకం పత్తి విత్తనాన్ని విక్రయించేవారిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తున్నారు. దీంతో బీజీ–3 పత్తి విత్తన దందాకు చెక్ పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. పైపెచ్చు ఈ పత్తి విత్తనానికి వ్యవసాయశాఖ అధికారులు కొందరు వంత పాడుతున్నారు. అనుమతిస్తే తప్పేంటన్న ధోరణిలో కొందరు కీలకాధికారులున్నారు. దీంతో బీజీ–3 పత్తి విత్తనం చాపకింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తుంది. గ్లైపోసేట్‌తో కేన్సర్ రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎక్కువగా పత్తి సాగవుతుంది. ఖరీఫ్‌లో పత్తి సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాల్లో ఉంటుంది. ఆ తర్వాత వరిని 23.75 లక్షల ఎకరాల్లో సాగుచేస్తారు. అయితే.. 2018–19 ఖరీఫ్‌లో పత్తి సాధారణం కంటే ఎక్కువగా ఏకంగా 44.91 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.91 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దేశంలో పత్తి సాగు అత్యధికంగా చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. దీంతో తెలంగాణపై ప్రపంచంలోని బహుళజాతి పత్తి విత్తన కంపెనీలు దృష్టిసారించాయి. బీజీ–2 పత్తి విత్తనం ఫెయిల్ కావడంతో మోన్శాంటో కంపెనీ రౌండ్ ఆఫ్ రెడీ ఫ్లెక్స్ (ఆర్ఆర్ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మన దేశంలో బీజీ–3కి అనుమతి నిరాకరించడంతో దీన్ని అడ్డదారిలో విస్తరించే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. బీజీ–3లో వచ్చే కలుపు నివారణకు గ్లైపోసేట్ అనే ప్రమాదకరమైన పురుగుమందును వాడతారు. బీజీ–3 పండిస్తున్నారంటే గ్లైపోసేట్ కచ్చితంగా వాడాల్సిందే. ఈ గ్లైపోసేట్ అత్యంత ప్రమాదకరమైందని, దీని వల్ల కేన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించింది. 28 శాతానికిపైగా బీజీ–3 విత్తనాలు తెలంగాణ వ్యవసాయశాఖ అధికారిక నివేదిక ప్రకారం.. 2017–19 మధ్య 1062 పత్తి విత్తన శాంపిళ్లను హైదరాబాద్ మలక్‌పేటలోని డీఎన్ఏ ల్యాబ్‌లో పరీక్షించింది. అందులో ఏకంగా 302 శాంపిళ్లలో నిషేధిత బీజీ–3 విత్తనాలు ఉన్నట్లు తేలింది. అంటే ఏకంగా 28.43% అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున బీజీ–3 విత్తనం సాగవుతున్నా అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. వ్యవసాయశాఖ వర్గాలు బీజీ–3ని ఉత్పత్తి చేస్తున్న 8 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని భావించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వచ్చే ఖరీఫ్ కోసం దాదాపు 1.30 కోట్ల పత్తి ప్యాకెట్లను రైతులకు సరఫరా చేయాలని దళారులు ప్రయత్నాల్లో ఉన్నారు. గతేడాది మార్కెట్లో 68,766 లీటర్ల గ్లైపోసేట్‌ను వ్యవసాయశాఖ వర్గాలు పట్టుకున్నాయి. కానీ సీజ్ చేయలేదు. దీంతో గ్రామాల్లో విషం ఏరులై పారుతోంది. తినే తిండి, గాలి, వాతావరణం కలుషితమై జనజీవనానికి జబ్బులను తెచ్చి పెడుతుంది. బీజీ–3పై తూతూమంత్రపు చర్యలు బీజీ–3కి అడ్డుకట్టవేయాలని పైకి చెబుతున్నా వ్యవసాయ శాఖ సీరియస్‌గా తీసుకోవడంలేదు. తయారీదారులపై చర్యలు తీసుకోకుండా, మార్కెట్లోకి ప్రవేశించాక చేసే దాడులతో వచ్చే ప్రయోజనముండదు. అధికారుల చిత్తశుద్దిని శంకించాల్సి వస్తోంది. – నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు క్యాన్సర్ కారకం గ్లైపోసేట్‌తో కేన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లోనే నిర్ధారించింది. దేశంలో ఈ అమ్మకాలపై అనేక పరిమితులున్నాయి. కానీ విచ్చలవిడిగా వాడటం వల్ల జీవవైవిధ్యానికి ప్రమాదం ఏర్పడనుంది. దీనిపై సర్కారు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ కమల్‌నాథ్, జనరల్ సర్జన్, హైదరాబాద్ -
గుట్టుగా గ్లైసిల్..
పెంచికల్‌పేట(సిర్పూర్): నిషేధిత గ్లైసిల్, గ్లైఫోసెట్ అమ్మకాలు మళ్లీ గ్రామాల్లో జోరందుకుంటున్నాయి. వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. పత్తిలో కలుపు సమస్య ఉండదని, గులాబీ పురుగు నివారణకు మెరుగ్గా పనిచేస్తుందని నమ్మబలికి రైతులకు అంటగడుతున్నారు. రబీ సీజన్ ఇంకా పూర్తి కాకముందే వచ్చే ఖరీఫ్ కోసం నకిలీ విత్తనం గ్రామాల్లోకి చేరుతోంది. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా దందా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్ దుకాణాల ముసుగులోనూ ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు(గత ఖరీఫ్ సీజన్) ఉమ్మడి జిల్లాలో 34 చోట్ల రూ.2 కోట్ల వరకు విలువ చేసే నకిలీ విత్తనం పట్టుబడడం దందా తీవ్రతకు అద్దం పడుతోంది. పత్తి సాగుకే మొగ్గు.. ఉమ్మడి జిల్లాలో రైతులు ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా సుమారు 9వేల నుంచి 10వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్లు అంచనా. కాగా పత్తి సాగులో కొన్నేళ్లుగా రైతులు బీటీ– 2, బీటీ– 3 విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నారు. చీడపీడల వ్యాప్తి తట్టుకుంటుందని, కలుపు నివారణకు కూలీల సమస్య ఉండదని రైతులు వీటి వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కలుపు నివారణ మందులు తట్టుకునే గ్లైసిల్, తదితర పేర్లతో గుర్తింపు లేని విత్తనాలు తయారు చేసి రైతులకు కట్టబెడుతున్నారు. వీటి ద్వారా పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో పాటు భూసారం దెబ్బతినడం, రైతులు అనారోగ్యం బారిన పడే అవకాశముందని ప్రభుత్వం నిషేధించింది. కాని ఏటేటా సీజన్‌కు ముందే ఈ దందా మూడు పూలు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోంది. కుమురం భీం జిల్లాలో అధికం.. నిషేధిత గ్లైసిల్, గ్లైఫోసెట్ అమ్మకాలు ఉమ్మడి జిల్లా పరిధిలోని కుమురం భీం జిల్లాలో అధికంగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో 3,12,796 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, పెంచికల్పేట్, సిర్పూర్(టి), (యూ), రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి, మండలాల్లో పత్తి సాగు అధికంగా ఉంటుంది. జిల్లాలో 2016– 17 ఏడాది ఖరీఫ్‌లో 1,86,332 ఎకరాల్లో, 2017– 18లో రికార్డు స్థాయిలో 2,38,096 ఎకరాల్లో, 2018– 19 ఏడాదిలో 2,30,000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. మద్దతు ధర ఒకానొక సందర్భంగా రూ.5500లు పలకగా ఈసారి మరింత పెరిగే అవకాశముందని రైతులు భావిస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకుని వ్యాపారులు ఈ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. గ్లైసిల్ విత్తనాలు కిలోకు సుమారు రూ.2000ల నుంచి రూ.2200ల వరకూ విక్రయిస్తున్నారు. మరోవైపు ఇక్కడ బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామంలో ఇటీవల క్వింటాల్ గ్లైసిల్ విత్తనాలను పట్టుకున్నారు. పాపన్పేట్లో 20 కిలోలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రా నుంచి.. నకిలీ విత్తనాలను వ్యాపారులు మహారాష్ట్ర, ఆంధ్రా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గ్రామాల్లోని బడా రైతులు, వ్యాపారులతో చేతులు కలిపి సులువుగా విక్రయాలు చేపడుతున్నారు. ప్యాకెట్లు, విడిగా కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాలు సాగుచేస్తే కలిగే దుష్పలితాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయాధికారులు ఖరీఫ్ సీజన్‌కు ముందు ఎలాంటి సదస్సులు నిర్వహించడం లేదు. దీంతో రైతులు సైతం అధిక దిగుబడి ఆశతో గ్లైసిల్ మోజులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధి సరిహద్దు ప్రాణహిత నది అవతలి వైపు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా గ్లైసిల్, గ్లైఫోసెట్ దిగుమతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. విక్రయిస్తే చర్యలు తప్పవు ప్రభుత్వం గ్లైసిల్ విత్తనాలను, గ్లైఫోసెట్ మందులను నిషేధించింది. పోలీసు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నాం. అమాయక రైతులకు నిషేధిత విత్తనాలను అంటగడుతున్న వారిపైన కేసులు నమోదు చేస్తాం. రైతులు నిషేధిత విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా రశీదులు తీసుకోవాలి. నిషేధిత విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలి. – రాజులనాయుడు, ఇన్చార్జి ఏడీఏ పెంచికల్పేట్ కేసులు నమోదు చేస్తున్నా.. గ్లైసిల్, గ్లైఫోసెట్ విక్రయాలపై నిత్యం కేసులు నమోదవుతున్నాయి. అయినా ఈ దందా మాత్రం ఆగడం లేదు. పోలీసులు, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో గత సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 కేసులు నమోదు చేశారు. ఇటీవల సైతం పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గతంలో మే, జూన్‌లో నకిలీ విత్తనాలు గ్రామాలకు చేరేవి. కాని గతేడాది నుంచి వ్యాపారులు ముందుగానే డపింగ్ చేస్తున్నారు. ఖరీఫ్ ఆరంభంలో సరఫరాకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయని, పోలీసు, వ్యవసాయ అధికారుల నిఘా ఎక్కువగా ఉంటుందని, ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం దందా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అధికారులు ఎన్నికల బిజీలో ఉంటుండడంతో ఇదే అదనుగా వ్యాపారులు ఎంచక్కా దిగుమతి చేసుకుంటున్నారు. సునాయాసంగా దిగుమతి చేసుకుంటూ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లో నమ్మకమైన కొందరు వ్యక్తుల ఇళ్లలో చేరవేసి భద్రపరుస్తున్నారు. పత్తి విత్తడం జూన్ రెండో వారం నుంచి మొదలవుతుంది. ఒక నెల రోజుల ముందే రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తుంటారు. కాగా గతేడాది నుంచి ఈ తనిఖీ, నిఘాను పసిగట్టిన నకిలీ కేటుగాళ్లు ఆరు నెలల ముందుగానే ఎక్కువగా విక్రయాలు సాగే ప్రాంతాలకు క్వింటాళ్ల కొద్దీ విత్తనాలు డపింగ్ చేసుకుంటున్నారు. -
విషమని తెలిసీ విక్రయాలు
సాక్షి, హైదరాబాద్ : గ్లైఫోసేట్.. జీవవైవిధ్యానికి తీవ్ర హాని కలిగించే రసాయనం. మానవ జీవితాలను కేన్సర్ మహమ్మారిపాలు చేసే కాలకూట విషం. ఇలాంటి విషాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. బీజీ–3 పత్తి విత్తనాలు వేసిన పొలంలో కలుపు నియంత్రణ కోసం ఈ మందును అడ్డగోలుగా వాడుతున్నారు. కొందరైతే సాధారణ కలుపు నివారణకూ ఉపయోగిస్తున్నారు. దీన్ని నియంత్రించాలనే తూతూమంత్రపు ఆదేశాలను ఖాతరు చేయని వ్యాపారులు.. కాసులకు కక్కుర్తి పడి ఈ విషాన్ని రైతులకు అంటగడుతున్నారు. గ్లైఫోసేట్‌తో కేన్సర్.. నిర్ధారించిన డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) కూడా గ్లైఫోసేట్‌తో కేన్సర్ వచ్చే అవకాశముందని 2015లోనే నిర్ధారించింది. ఇటీవల అమెరికాలోనూ ఈ విషయం నిర్ధారణ అయింది. దీన్ని తయారు చేసిన మోన్శాంటో మాత్రం గ్లైఫోసేట్‌తో కేన్సర్ వస్తుందన్న వాదనలను తిరస్కరిస్తూ వచ్చింది. అయితే ఇటీవల మోన్శాంటో అంతర్గత నివేదిక బట్టబయలు కావడంతో గ్లైఫోసేట్ ప్రమాదకరమైనదని వెల్లడైంది. గ్లైఫోసేట్ను 130 దేశాల్లో దాదాపు వంద పంటలకు వినియోగిస్తున్నారు. దీంతో గ్లైఫోసేట్ అనే మందు ఆహారం, నీరు, వ్యవసాయ కూలీల మూత్రంలోనూ కనిపిస్తోంది. ఈ కలుపు మందును బీజీ–3 పత్తికి వేస్తే, పక్కనున్న ఇతర పంటలపైనా ప్రభావం చూపుతుంది. అవి విషపూరితమవుతాయి. అవి తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుంది. చిట్టీ రాసిస్తే చాలు మండల వ్యవసాయాధికారుల అండదండలతో నిషేధిత గ్లైఫోసేట్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బీజీ–3 పత్తి విత్తన సాగును అరికట్టేందుకు గ్లైఫోసేట్ను నియంత్రించిన ప్రభుత్వం.. తిరిగి అధికారులతోనే వాటి విక్రయాలు జరిపేలా వెసులుబాటు కల్పించింది. ‘మండల వ్యవసాయాధికారులు చిట్టీ రాసిస్తే.. ఆ ప్రకారం రైతులు గ్లైఫోసేట్ను కొనుక్కోవచ్చు. ఆ చిట్టీని చూసి పురుగుమందుల డీలర్లు రైతులకు అమ్ముకోవచ్చు’అని వ్యవసాయ శాఖ ఇచ్చిన వెసులుబాటు దుమారం రేపుతోంది. మరోవైపు దేశంలో తేయాకు తోటలకు, బీడు భూముల్లో పిచ్చి చెట్ల నిర్మూలనకు గ్లైఫోసేట్ను ఉపయోగించవచ్చని, ఆ ప్రకారం రైతులు కోరితే మండల వ్యవసాయాధికారులకు చిట్టీ రాసిస్తారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, అందులో సుమారు 10 లక్షల ఎకరాల్లో అనుమతి లేని బీజీ–3 పత్తి వేసినట్లు అంచనా. బీజీ–3లోని కలుపు నివారణకు గ్లైఫోసేట్ను వాడుతున్నారు. కేసుల్లేవ్.. మరోవైపు గ్లైఫోసేట్ విక్రయించే డీలర్లపైనా అధికారులు ఎలాంటి కేసులు పెట్టడంలేదు. లైసెన్సుల రద్దు లేదు. వాస్తవానికి గ్లైఫోసేట్ను స్వాధీనం చేసుకుంటే ఆ కలుపు మందును అత్యంత సురక్షిత ప్రాంతంలో ధ్వంసం చేయాలి. కానీ అవేవీ చేయడంలేదు. వ్యవసాయ శాఖ చేపట్టిన ఈ చర్యలతో బీజీ–3 విత్తనానికి మరింత ప్రోత్సాహం లభించినట్లయింది. ఉద్యాన పంటల్లోనూ వాడకం రాష్ట్రంలో పండ్ల తోటలు, చెరువు గట్లు, హరితహారం చెట్ల వద్ద కలుపు ఏపుగా పెరుగుతుంది. చెరువుల్లో గుర్రపు డెక్క కూడా పెరుగుతుంటుంది. ఈ కలుపును నివారించడానికి కూలీలు దొరకడంలేదు. కూలీల కొరత కారణంగా కలుపు నివారణకు రైతులు విరివిగా గ్లైఫోసేట్ మందును వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్లైఫోసేట్ మందును నిషేధిస్తే ఆయా రైతులు అన్యాయమైపోతారని ఉద్యాన శాఖాధికారులు విన్నవిస్తున్నారు. గ్లైఫోసేట్పై నిషేధం వద్దని కోరుతున్నారు. బొప్పాయి, నిమ్మ, జామ, మామిడి తదితర పంటల మధ్య కలుపు తొలగించేందుకు రైతులంతా గ్లైఫోసేట్నే వాడుతున్నారని ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేవలం తేయాకు తోటల్లో కలుపు నివారణ వరకే కేంద్ర ప్రభుత్వం గ్లైఫోసేట్ను అమనుతిస్తే.. పండ్ల తోటలు, ఇతర వాటికి కూడా వినియోగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తూతూమంత్రపు దాడులు గ్లైఫోసేట్ అమ్మకాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో నియంత్రించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారు. లక్షలాది లీటర్ల విక్రయాలు జరుగుతుంటే, ఇప్పటివరకు కేవలం 68,766 లీటర్ల గ్లైఫోసేట్ను మాత్రమే వ్యవసాయ శాఖ వర్గాలు పట్టుకున్నాయి. వాటిని పట్టుకున్నారే కానీ ఎక్కడా సీజ్ చేయకపోవడం గమనార్హం. భద్రంగా పురుగు మందుల డీలర్ల వద్దే వాటిని ఉంచుతున్నారు. పేరుకు వేలాది లీటర్లు పట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వ్యవసాయ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. దీంతో గ్రామాల్లో విషం ఏరులై పారుతోంది. విచ్చలవిడి విక్రయాలు: డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు తూతూమంత్రంగానే గ్లైఫోసేట్పై దాడులు జరుగుతున్నాయి. పైపై నియంత్రణ చర్యలే కానీ కఠినంగా వ్యవహరించడంలేదు. నియంత్రణ ఆదేశాలు కలెక్టర్లకు ఇచ్చినా వారు పట్టించుకోవడంలేదు. గ్లైఫోసేట్ విక్రయాల్లో కంపెనీలు పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుపుతున్నాయి. విచ్చలవిడిగా అమ్ముకుంటున్నాయి. గ్లైఫోసేట్‌తో అనారోగ్యం: డాక్టర్ నరేందర్, హైదరాబాద్ గ్లైఫోసేట్‌తో తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. కేన్సర్‌తోపాటు కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది. గ్లైఫోసేట్ వాడకం వల్ల రైతుల ఆరోగ్యంపైనా, తినే తిండిపైనా ప్రభావం చూపుతుంది. ఆహారం విషంగా మారుతుంది. -
గ్లైపోచేటు
కర్నూలు(అగ్రికల్చర్) : గ్లైపోసేట్.. కలుపు నివారణ మందు. దీనిని మోన్శాంటో బహుళజాతి విత్తన సంస్థ తయారు చేస్తోంది. జీవ వైవిధ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో దీని అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే గుట్టు చప్పుడుకాకుండా జిల్లాలో విక్రయాలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడా గ్లైపోసేట్ కలుపు మందు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. బీటీ పత్తి సాగు చేసే రైతులు కలుపు నివారణ కోసం దీనిని వాడుతున్నారు. గత ఏడాది జిల్లాలో పురుగు మందులు పిచికారీ చేస్తూ విషప్రభావానికి గురై 20 మందికిపైగా రైతులు మృత్యువాత పడ్డారు. వీరిలో కొందరు గ్లైపోసేట్ వాడకం వల్లే విషప్రభావానికి గురై మృతిచెందారనే విమర్శలూ వచ్చాయి. తాజాగా.. ఈ మందు వాడకం కేన్సర్‌కు కారణమవుతోందని అమెరికాలోని కోర్టు ఏకంగా మోన్‌శ్యాంటో కంపెనీకి రూ.2 వేల కోట్లు జరిమానా విధించడం చర్చనీయాంశం అయింది. అనుమతులు లేకున్నా సాగు.. హెచ్‌టీ(హైబ్రిడిక్ టాలరెంట్) పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ జిల్లాలో గత ఏడాది సాగు భారీగా పెరిగింది. దీనిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది హెచ్‌టీ పత్తి సాగు నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా... ఫలితం లేకుండాపోయింది. జిలాల్లో 1.50 లక్షల హెక్టార్లలో పత్తి సాగవగా..ఇందులో 50 వేల ఎకరాల్లో హెచ్‌టీ పత్తి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ విత్తన సంస్థలే బీజీ–2 పేరుతో హెచ్‌టీ పత్తి విత్తనాలను రైతుల్లోకి తీసుకెళ్లాయి. విత్తన దుకాణాల ద్వారా కాకుండా నేరుగా రైతులకు విక్రయించారు. తాము హెచ్‌టీ పత్తి సాగు చేసిన విషయం రైతులకు కూడా తెలియకపోవడం విశేషం. హెచ్‌టీ పత్తిలో కలుపు మందు నివారణకు ఉపయోగించే గ్లైపోసేట్ మందులో అనర్థాలు ఉన్నాయని జూన్ నుంచి డిసెంబరు నెల వరకు అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. యథావిధిగా అమ్మకాలు.... గ్లైపోసేట్ కెమికల్స్ వివిధ పేర్లతో లభ్యమవుతోంది. రౌండప్, గ్లెసైల్, వీడ్‌కిల్లర్ పేర్లతో అమ్ముతున్నారు. పెస్టిసైడ్ దుకాణాల ద్వారా కాకుండా గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో పొలాల్లో ఎటువంటి పంటలు లేని సమయంలో మొండిజాతి కలుపును నివారించుకునేందుకు గ్లైపోసేట్ వాడకానికి అనుమతి ఉంది. ఇందుకు వ్యవసాయాధికారి/ వ్యవసాయ శాస్త్రవేత్త అనుమతి అవసరం. అయితే ఎవరూ సిఫారస్సు లేకుండానే ప్రమాదకమైన మందులను విచ్చిల విడిగా అమ్ముతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయాధికారుల తనిఖీలు లేకపోవడంతో పురుగు మందుల దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ నష్టాలు.. గ్లైపోసేట్ వాడటం వల్ల నేల నిస్సారంగా మారుతుంది. మందు అవశేషాలు పంట ఉత్పత్తులు, గడ్డిలో పేరుకొని ఉండి..మానవాళి ఆరోగ్యాలకు హాని కలిగిస్తాయి. అవశేషాలు గాలి, నీరులో కలిసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో 2014 నుంచి గ్లైపోసేట్ అమ్మకాలు పెరిగినా పట్టించుకునే వారు లేరు. లైసెన్సులు రద్దు చేస్తాం: జిల్లాలో గ్లైపోసేట్ అమ్మకాలను నిషేధించాం. పెస్టిసైడ్ డీలర్లకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం. వ్యవసాయాధికారి సిఫారస్సు లేకుండా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. ఇప్పటికే వ్యవసాయాధికారులు షాపులు తనిఖీ చేసి తాత్కాలికంగా స్టాప్‌సేల్ ఇచ్చారు. పత్తి పంట ఉన్న సమయంలో అమ్మకాలు చేపడితే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తాం. మల్లికార్జునరావు, డీడీఏ(పీపీ), వ్యవసాయ శాఖ, కర్నూలు -
2,000 కోట్ల భారీ జరిమానా
శాన్ఫ్రాన్సిస్కో: బహుళజాతి విత్తన, పురుగుమందుల కంపెనీ మోన్శాంటోకు అమెరికాలోని ఓ న్యాయస్థానం షాకిచ్చింది. తమ ఉత్పత్తుల్ని వాడితే కేన్సర్ సోకుతుందన్న విషయాన్ని దాచిపెట్టి ఓ వ్యక్తి కేన్సర్ బారిన పడేందుకు కారణమైనందుకు ఏకంగా రూ.2,003 కోట్ల(29 కోట్ల డాలర్లు) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కోర్టు జ్యూరీ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళతామని మోన్శాంటో ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న డ్వేన్ జాన్సన్(46) బెనికాలో ఓ పాఠశాలలో గ్రౌండ్‌మెన్‌గా పనిచేసేవారు. విధుల్లో భాగంగా స్కూల్ ప్రాంగణం, మైదానంలో కలుపుమొక్కలు పెరగకుండా మోన్శాంటో తయారుచేసిన ‘రౌండర్’ మందును స్ప్రే చేసేవారు. ఈ కలుపుమొక్కల నాశినిలో ప్రధానంగా ఉండే గ్లైఫోసేట్ అనే రసాయనం వల్ల కేన్సర్ సోకుతుంది. ఈ విషయం సంస్థాగత పరీక్షల్లో వెల్లడైనా మోన్శాంటో బయటకు చెప్పలేదు. రౌండప్ కలుపు నాశినిని తరచుగా వాడటంతో తెల్ల రక్తకణాలకు వచ్చే అరుదైన నాన్‌హడ్జ్‌కిన్స్ లింఫోమా అనే కేన్సర్ సోకినట్లు జాన్సన్‌కు 2014లో తెలిసింది. చికిత్స చేసినా జాన్సన్ బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చారు. మరుసటి ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఆర్క్) పరిశోధనలో సంచలన విషయం బయటపడింది. మోన్శాంటో తయారుచేస్తున్న కలుపుమొక్కల నాశనులు రౌండప్, రేంజ్ ప్రోలో కేన్సర్ కారక గ్లైఫోసేట్ అనే ప్రమాదకర రసాయనం ఉందని ఐఆర్క్ తేల్చింది. ఈ విషయాన్ని కస్టమర్లకు మోన్శాంటో తెలపలేదంది. కాలిఫోర్నియాలో కేసు దాఖలు.. మోన్శాంటో కలుపు మందులపై వినియోగదారుల్ని హెచ్చరించకపోవడంతో కాలిఫోర్నియాలోని కోర్టులో కేసు దాఖలైంది. మోన్శాంటో తయారుచేసిన రౌండప్ కారణంగా జాన్సన్‌కు కేన్సర్ సోకిందని ఆయన లాయరు వాదించారు. తమ ఉత్పత్తులు సురక్షితమైనవని మోన్శాంటో ప్రతినిధులు కోర్టులు తెలిపారు. దాదాపు 8 వారాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. ఐఆర్క్ నివేదికనూ అధ్యయనం చేసింది. చివరగా కేన్సర్ కారక గ్లైఫోసేట్ గురించి మోన్శాంటో వినియోగదారుల్ని హెచ్చరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. జాన్సన్‌కు నయంకాని కేన్సర్ సోకేందుకు కారణమైనందున ఆయనకు పరిహారంగా రూ.1,727 కోట్లు, ఇతర ఖర్చుల కింద మరో రూ.276 కోట్లు, మొత్తంగా రూ.2,003 కోట్లు(29 కోట్ల డాలర్లు) చెల్లించాలని మోన్శాంటోను ఆదేశించింది. జాన్సన్ ఆరోగ్యస్థితిపై జ్యూరీ సానుభూతి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుతో జాన్సన్ కన్నీటిపర్యంతమయ్యారు. తీర్పు ఇచ్చిన జ్యూరీలోని సభ్యులందరికీ జాన్సన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా కోర్టు తీర్పుపై తాము అప్పీల్‌కు వెళతామని మోన్శాంటో కంపెనీ ఉపాధ్యక్షుడు స్కాట్ పాట్రిడ్జ్ చెప్పారు. డ్వేన్ జాన్సన్ -
కిల్లర్ కలుపు.. గ్లైఫొసేట్!
మనం అమాయకంగా కలుపును చంపుదామని గ్లైఫొసేట్ రసాయనాన్ని చల్లుతున్నాం.. అది మనందరి దేహాల్లోకీ చొరబడి కేన్సర్‌ను, ఇంకా ఎన్నో మాయ రోగాలను పుట్టిస్తోంది.. మన భూముల్లోకి, నీటిలోకి, గాలిలోకి.. మనుషులు, జంతువుల మూత్రంలోకి.. చివరకు తల్లి పాలల్లోకీ చేరిపోయింది.. పంట భూములకు ప్రాణప్రదమైన వానపాములను, సూక్ష్మజీవరాశిని మట్టుబెట్టి నేలను నిర్జీవంగా మార్చేస్తున్నది. దీనివల్ల కేన్సర్ వస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధారసహితంగా ప్రకటించి ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఇరవయ్యేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చావు డప్పు కొడుతోంది! అయినా, దీన్ని నిషేధించడానికి పాలకులు తటపటాయిస్తున్నారు. అదీ.. బహుళజాతి కంపెనీల సత్తా! కొన్ని దేశాలు నిషేధిస్తున్నాయి, ఎత్తివేస్తున్నాయి. మన దేశపు పంట పొలాల్లో ఈ కిల్లర్ కెమికల్ ఐదేళ్లుగా అక్రమంగా హల్చల్ చేస్తున్నా మన పాలకులు నిద్రనటించారు. కలుపు చప్పున చస్తుందన్న ఒక్క సంగతి తప్ప.. అది మన మూలుగల్నే పీల్చేస్తుందన్న సంగతి అమాయక రైతులకు తెలియజెప్పకపోవడం వల్ల దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది.. కూలీలు లేరు.. ఇదీ లేకపోతే సేద్యం ఎలా? అనే వరకు వచ్చింది. ఇన్నాళ్లూ చలనం లేని ప్రభుత్వాలు ఎట్టకేలకు ‘నిషేధం లాంటి ఆంక్షలు’ విధించిన నేపథ్యంలో.. కచ్చితంగా ఏరిపారేయాల్సిన గ్లైఫొసేట్‌పై ‘సాగుబడి’ ఫోకస్!∙ కలుపు మందులు మార్కెట్లో చాలా రకాలున్నాయి కదా.. గ్లైఫొసేట్పైనే ఎందుకింత రగడ జరుగుతున్నట్లు? ఎందుకంటే.. ఇది మామూలు కలుపు మందు కాదు. సాధారణ కలుపు మందు అయితే పిచికారీ చేసినప్పుడు ఏయే మొక్కలపై ఏయే ఆకులపై పడిందో అవి మాత్రమే ఎండిపోతాయి. ఆ మొక్క మొత్తం నిలువెల్లా ఎండిపోదు. దీన్నే ‘కాంటాక్ట్’ కెమికల్ అంటారు. ఇది అంతర్వాహిక(సిస్టమిక్) స్వభావం కలిగినది. అంటే.. గ్లైఫొసేట్ మొక్కపైన ఆకుల మీద పడినా చాలు.. దాని కాండం నుంచి పిల్ల వేర్ల వరకు నిలువునా ఎండిపోతుంది. అంటే.. ఇది చల్లిన పొలంలో మట్టిలోని వానపాములు, సూక్ష్మజీవరాశి కూడా చనిపోతుంది. దీని అవశేషాలు భూగర్భ నీటిని, వాగులు, వంకలు, చెరువు నీటిని కూడా కలుషితం చేస్తుంది. గ్లైఫొసేట్ పిచికారీ చేసే కార్మికులు ఏమాత్రం పీల్చినా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. మూత్రపిండాలు, కాలేయం, పెద్దపేగులో సూక్ష్మజీవరాశి దెబ్బతింటాయి. కేన్సర్ వస్తుంది. నాడీ వ్యవస్థ, నిర్ణాళ గ్రంథుల వ్యవస్థ అస్థవ్యస్థమవుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కారకమని ప్రకటించిన డబ్లు్య.హెచ్.ఓ. అత్యంత ప్రమాదకరమైన వ్యవసాయ పురుగుమందులు/కలుపు మందులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్య.హెచ్.ఓ.) ప్రకటించిన 15 రకాల్లో గ్లైఫొసేట్ ముఖ్యమైనది. డబ్లు్య.హెచ్.ఓ. అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.సి.) తర్జనభర్జనల తర్వాత 2017లో ఇది వాడిన చోట కేన్సర్ వ్యాపిస్తోందని తేల్చిచెప్పింది. గ్లైఫొసేట్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికాలో మోన్శాంటో కంపెనీపై సుమారు 4 వేల కేసులు దాఖలయ్యాయి. గ్లైఫొసేట్ వల్లనే తనకు కేన్సర్ సోకిందని ఆరోపిస్తూ డి వేనె జాన్సన్(46) అనే కార్మికుడు దావా వేశాడు. అయినా, కంపెనీల ఒత్తిళ్ల నేపథ్యంలో గ్లైఫొసేట్‌ను పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వాలు తటపటాయిస్తూ.. నామమాత్రపు ఆంక్షలతో సరిపెడుతున్నాయి. 1974 నుంచి మార్కెట్లో.. కొత్త ఔషధం కనుగొనే ప్రయోగాల్లో అనుకోకుండా గ్లైఫొసేట్ 1950లో వెలుగుచూసింది. అయితే, ఇది కలుపుమందుగా పనికొస్తుందన్న సంగతి 1970లో బయటపడింది. మోన్శాంటో కంపెనీ 1974లో దీన్ని కలుపుమందుగా ప్రపంచవ్యాప్తంగా అమ్మటం మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ముఖ్యంగా జన్యుమార్పిడి పంటలు ఎక్కువగా సాగయ్యే దేశాల్లో గ్లైఫొసేట్ ఎక్కువ వాడుకలో ఉంది. ఇప్పటి వరకు 860 కోట్ల లీటర్లు వాడగా.. గత పదేళ్లలోనే ఇందులో 72% వాడారు. అమెరికా, అర్జెంటీనా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా,కొలంబియా, దక్షిణాఫ్రికాతోపాటు భారత్, శ్రీలంక దేశాల్లో విరివిగా వాడుతున్నారు. దీని వాడకంపై అమెరికాలోని 18 రాష్ట్రాల్లో, కెనడాలో 8 రాష్ట్రాల్లో ఆంక్షలున్నాయి. కొలంబియా, శ్రీలంకల్లో నిషేధం విధించినా తర్వాత తొలగించారు. ఐరోపా యూనియన్ కూటమిలోని 9 దేశాలు గ్లైఫొసేట్ విక్రయ లైసెన్సులను రెన్యువల్ చేయరాదని నిర్ణయించాయి. మూడేళ్లలో నిషేధిస్తామని ఫ్రాన్స్ ప్రకటించగా, సాధ్యమైనంత త్వరగా దీని వాడకం నిలిపేయాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా.. పత్తి పొలాల్లో కలుపు మందులు చల్లుతూ విషప్రభావంతో నేలకొరిగిన/తీవ్ర అనారోగ్యం పాలైన రైతులు, రైతు కూలీల ఉదంతాలు మహారాష్ట్రలోని యావత్మాల్ తదితర ప్రాంతాల్లో గత ఏడాది వెల్లువెత్తిన ఉదంతాలతో గ్లైఫొసేట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి అక్రమంగా సాగులోకి వచ్చిన బీజీ–3 పత్తి వంగడంతో దీని వినియోగం కూడా పెరుగుతూ వచ్చింది. రెండు, మూడేళ్లుగా అక్రమ బీజీ–3 పత్తి తోడై.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల నల్లరేగడి భూముల్లో గ్లైఫొసేట్ కలుపుమందు విచ్చలవిడిగా మరణమృదంగం మోగిస్తోంది. దీని వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మన దేశంలో గ్లైఫొసేట్‌ను తేయాకు తోటల్లో, ‘పంట లేని ప్రదేశాల్లో’నూ వాడొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, అధికారుల అసలత్వం వల్ల ఇది బీజీ–3 పత్తితోపాటు సోయా, బత్తాయి, మామిడి తదితర తోటల్లో కూడా కలుపు నివారణకు ఇది వాడుతున్నారు. రైతులు అప్పటికప్పుడు కలుపు బాధ పోతుందన్న సౌలభ్యం చేస్తున్నారే తప్ప.. దీర్ఘకాలం పాటు అది తెచ్చే చేటును గ్రహించలేకపోతున్నారు. వీరికి అవగాహన కలిగించాల్సిన వ్యవసాయ శాఖలు నిమ్మకునీరెత్తినట్టు ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతుల వైపు దృష్టి సారించలేకపోతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ గ్లైఫొసేట్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ప్రత్యామ్నాయాలు ఏమిటి? అయితే, రైతులకు ప్రత్యామ్నాయం ఏమిటి? అన్నది ప్రశ్న. గ్లైఫొసేట్ వల్ల పొంచిఉన్న పర్యావరణ సంక్షోభం, కేన్సర్ తదితర జబ్బుల ముప్పు గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారోద్యమాన్ని చేపట్టాలి. రైతుల పొలాల్లో, తోటల్లో కలుపు తీతకు ఉపాధి కూలీలను ఉపయోగించేలా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. దీనితో పాటు.. చిన్న, మధ్యతరహా రైతులకు అందుబాటులో ఉండే సులభంగా కలుపు తీసే పరికరాలు, చిన్న తరహా కలుపు యంత్రాలను ప్రభుత్వం విరివిగా అందుబాటులోకి తేవాలి. వచ్చే ఏడాది బీజీ–3తో గ్లైఫొసేట్ కూడా పోతుంది ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పత్తిలో 85% బీజీ–2 ఉంటుంది.. 15% వరకు బీజీ–3 ఉంటుంది. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాల వల్లనే రైతులు గ్లైఫొసేట్ పిచికారీ చేస్తున్నారు. గ్లైఫొసేట్‌ను దాదాపు నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి వచ్చే ఏడాది నాటికి.. బీజీ–3 పత్తి విత్తనాలను విత్తన కంపెనీలు తయారు చేయవు, గ్లైఫొసేట్ కూడా అందుబాటులో ఉండదు, రైతులు కూడా కొనరు. కలుపు తీతకు ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని, కలుపుమందుతో రూ.2 వేలతో పోతుందని, అందుకే గ్లైఫొసేట్ వాడుతున్నామని రైతులు అంటున్నారు. అయితే, ఎకరానికి రూ.4 వేలు ఖర్చయినా గుంటకతోనో ట్రాక్టరుతోనో, కూలీలతోనో కలుపు నివారించుకోవాలే తప్ప గ్లైఫోసేట్ వంటి ప్రమాదకరమైన కలుపుమందులు వాడకూడదు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచించిన వివిధ పద్ధతుల్లోనే రైతులు కలుపు నివారించుకునే ప్రయత్నం చేయటం రైతులకు, పర్యావరణానికి కూడా మంచిది. – డా. కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రియ విత్తన ధృవీకరణ ప్రాధికార సంస్థ, హైదరాబాద్ బీజీ–3 పత్తిపై ఐదేళ్లుగా నిర్లక్ష్యం ప్రపంచ ఆహార సంస్థ గ్లైఫొసేట్ కలుపుమందు వల్ల మనుషులకు కేన్సర్ వస్తున్నదని గత ఏడాది నిర్థారించింది. దీన్ని తట్టుకునే పత్తి హైబ్రిడ్ (బీజీ–3) పంట తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం నుంచే సాగులో ఉంది. 2013 నుంచి అనేక దఫాలు పూర్తి ఆధారాలతో మేం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చాం. పట్టించుకోనందునే గత రెండేళ్లలో లక్షలాది ఎకరాలకు విస్తరించింది. మన దగ్గర పంటల్లో వాడటంతోపాటు.. కెనడా తదితర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న కందిపప్పు, బఠాణీలు, సోయా నూనెలు కలుపుమందులను తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలవే. వీటిల్లో గ్లైఫొసేట్ అవశేషాలు అత్యధిక పరిమాణంలో ఉన్నట్లు ఇటీవల వెలుగులోకి రావడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. వీటిని దిగుమతి చేసుకునే ముందే కఠినమైన పరీక్షలు జరిపి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. జన్యుమార్పిడి ఆహారంపై కచ్చితంగా లేబుల్ ముద్రించాలని మన చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. మనం గ్లైఫొసేట్ వాడమని చెప్పలేదు కాబట్టి, దీని వల్ల భూమిలో జీవరాశికి, నీటి వనరులకు, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరుగుతుందో ప్రభుత్వం కనీస అధ్యయనం కూడా చేయకపోవడం విడ్డూరం. సోయా, నువ్వు పంటలను నూర్పిడి చేయడంలో సౌలభ్యం కోసం కూడా పంటపైనే గ్లైఫొసేట్ పిచికారీ(డెస్సికేషన్) చేస్తున్నారు. ప్రజారోగ్యంపై ఈ అవశేషాల ప్రభావం ఏమిటన్నది ఆందోళనకరం. – డా. జీవీ రామాంజనేయులు (90006 99702), సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ గ్లైఫొసేట్‌ను కేంద్రం నిషేధించాలి ఉపాధి కూలీలతో కలుపు తీయించాలి గ్లైఫొసేట్ కలుపుమందు వాడకం ఇంతకు ముందు నుంచే వున్నా.. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి వల్ల రెండేళ్లుగా బాగా పెరిగింది. మహారాష్ట్రలోని యావత్మాల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవల సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు తెలిశాయి. ప్రభుత్వం ఆంక్షలు విధించినా అధికారుల ఉదాసీనత వల్ల దీని అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. పంట వేయడానికి ముందు, మొలక దశలో గడ్డి మొలిచినప్పుడు గ్లైఫొసేట్ కొడుతున్నారు. పాములు, పురుగూ పుట్రా చేరతాయని భయంతో కొడుతున్నారు. ఇదేమో కలుపును చంపే మందు.. అయితే, గులాబీ పురుగుకు కూడా గ్లైఫొసేట్ వాడుతున్నారని, ఇది పురుగుమందులకూ లొంగకుండా పోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. యావత్మాల్ ప్రాంతంలో పత్తి చేలల్లో వీళ్లు కలుపు అని చెబుతున్న మొక్కల్లో ఎక్కువ భాగం కొయ్య (తోట)కూర ఉంది. కొందరు రైతులు, కూలీలు దీన్ని పీకి ఇంటికి తీసుకెళ్తున్నారు.. వండుకు తినడానికి. అటువంటి దానిపై అత్యంత ప్రమాదకరమైన రసాయనంగా, కేన్సర్ కారకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన గ్లైఫొసేట్‌ను చల్లుతున్నారు. ఈ పూట కలుపు చావడం గురించే ఆలోచిస్తున్నారు తప్ప.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి నశించి మంచి నల్లరేగడి భూములు కూడా నిస్సారమైపోతున్న సంగతి.. నీరు, గాలి కలుషితమవుతున్న సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.గ్లైఫొసేట్ చల్లుతూ ఉంటే కొన్నాళ్లకు కొయ్య తోట కూర వంటి కొన్ని రకాల మొక్కలే కొరకరాని కొయ్యలవుతాయి. అమెరికా పొలాల్లో కొన్ని రకాల కలుపు మొక్కలు 20 అడుగుల ఎత్తు వరకు బలిసిపోతున్నాయి. ఇప్పుడు చల్లితే మున్ముందు వేసే పంటల మీద కూడా దీని దుష్ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్లైఫోసేట్ను నిషేధించి, సక్రమంగా అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని కలుపుతీతకు అనుసంధానం చేస్తే రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. యంత్రం అవసరం లేకుండా నడిచే కలుపుతీత పరికరాలను రైతులకు విరివిగా అందించాలి. – డా. దొంతి నరసింహారెడ్డి (90102 05742), డైరెక్టర్, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
గ్లైపోసేట్‌తో క్యాన్సర్
సాక్షి, హైదరాబాద్: గ్లైపోసేట్ కలుపు మందుతో క్యాన్సర్ వస్తుందని తేలిపోయింది. ఈ విషయాన్ని అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కోర్టు ముందు ఓ అడ్వొకేట్ ఆధారాలతో సహా ఉంచాడు. ఈ మందును తయారుచేసిన మోన్శాంటో కంపెనీ అంతర్గత ఈ–మెయిళ్ల నివేదికను ఆయన బట్టబయలు చేశాడు. ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఆ కీలకమైన నివేదికను కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో అమెరికాలోనూ గ్లైపోసేట్‌పై నిషేధం విధించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. బీజీ–3లో కలుపు నివారణకు మోన్శాంటో బహుళజాతి విత్తన కంపెనీ గ్లైపోసేట్ అనే మందును తయారుచేసింది. దీనివల్ల జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, జంతుజాలం, మానవాళికి ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అయితే మోన్శాంటో దీనికి సంబంధించిన పరిశోధనల ఫలితాలను ఇన్నాళ్లూ రహస్యంగా దాచి ఉంచింది. క్యాన్సర్ వస్తుందన్న వివరాలు ఇప్పుడు బట్టబయలు కావడంతో అంతా విస్తుపోతున్నారు. ఈ పరిణమాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మంగళవారం ఢిల్లీలో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. అమెరికాలో గ్లైపోసేట్‌ను నిషేధించే అవకాశం ఉన్నందున దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. తేయాకు తోటల వరకు గ్లైపోసేట్ వాడకానికి అనుమతి ఉందని, అయితే దాన్నీ కూడా నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్లైపోసేట్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్లైపోసేట్ అమ్మకాలను నిలుపుదల చేయాలని వ్యవసాయశాఖ ఆదేశాలిచ్చింది. ఎవరైనా ఈ మందును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 15 శాతం విస్తీర్ణంలో బీజీ–3 పత్తి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) కూడా గ్లైపోసేట్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశముందని 2015లోనే నిర్ధారించింది. గ్లైపోసేట్‌ను ప్రపంచంలో 130 దేశాల్లో వాడుతున్నారు. దీంతో ఈ మందు అవశేషాలు ఆహారం, నీరు, వ్యవసాయ కూలీల మూత్రంలో కనిపిస్తున్నాయి. రాష్ట్రం గ్లైపోసేట్‌పై నిషేధం విధించినా బీజీ–3 పత్తి పెద్దఎత్తున సాగైంది. ఇప్పటికే 36.86 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. అందులో 5.40 లక్షల ఎకరాల్లో బీజీ–3 సాగైనట్లు తెలుస్తోంది. ఈ సాగుకు గ్లైపోసేట్ కలుపు మందు వాడకం తప్పనిసరి. దాన్ని నిషేధించినా రైతులు ఏదో విధంగా కొనుగోలు చేయాల్సిన íస్థితి. తమ టాస్క్‌ఫోర్స్ టీం దాడులు చేసి దీన్ని అరికడుతుందని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు ‘సాక్షి’కి తెలిపారు. -
‘గ్లైపోసెట్’పై నిషేధం!
సాక్షి, హైదరాబాద్: అనుమతిలేని బీజీ–3 పత్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. అందుకోసం బీజీ–3కి ఉపయోగించే గ్లైపోసెట్ అనే కలుపు మందును నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. ప్రధానంగా పత్తి సాగు చేసే ఖరీఫ్ సీజన్లో జూన్ నుంచి నవంబర్ వరకు ఈ కలుపు మందును నిషేధించాలని విజ్ఞప్తి చేసింది. గ్లైపోసెట్‌ను నిషేధిస్తే సాధారణంగా బీజీ–3 పత్తి సాగును నిలువరించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. అయితే గ్లైపోసెట్‌ను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, లేకుంటే కేంద్రానికి సిఫార్సు చేయాలా అన్న దానిపై స్పష్టత లేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తేడా గుర్తించడం కష్టం.. రాష్ట్రంలో ఖరీఫ్‌లో అన్ని పంటలకంటే పత్తి సాగే అధికంగా ఉంటుంది. గతేడాది 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. దేశంలో అనుమతి కలిగిన బీజీ–1, 2 విత్తనాలనే విక్రయిస్తారు. దానికే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే బీజీ–2ని గులాబీరంగు పురుగు పట్టి పీడిస్తుండటంతో అనేకమంది రైతులు గతేడాది ఖరీఫ్‌లో అనుమతిలేని బీజీ–3 విత్తనాన్ని ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన అనేక కంపెనీలు బీజీ–3ని రైతులకు రహస్యంగా అంటగట్టాయి. ఒక అంచనా ప్రకారం పత్తి సాగులో 20 శాతం వరకు రైతులు బీజీ–3ని సాగు చేశారు. బీజీ–2కు, బీజీ–3కి తేడా కనిపించదు. రెండు రకాల మొక్కలు ఒకేలా ఉంటాయి. కాబట్టి వాటిని నేరుగా చూసి గుర్తించడం కష్టం. కాబట్టి బీజీ–3కి అడ్డుకట్ట గ్లైపోసెట్ కలుపు మందు నిషేధంతోనే సాధ్యమని భావిస్తున్నారు. గ్లైపోసెట్‌ను నిషేధిస్తే..? బీజీ–3 పత్తి విత్తనాలను నిషేధించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కానీ అది విచ్చలవిడిగా రైతులకు అందుబాటులోనే ఉంటోంది. మోన్శాంటో కంపెనీ రౌండ్ అప్ రెడీ ప్లెక్స్(ఆర్ఆర్ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మహికో కంపెనీ ఆర్ఆర్ఎఫ్ కారకం గల బీటీ–3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మక పరిశీలనలు జరిపింది. ఇప్పుడది పత్తి పంటలో ఉంది. ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసే విధంగా వ్యాపిస్తోంది. బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు గ్లైపోసెట్‌ను వాడతారు. ఆ మందు లేకుంటే బీజీ–3లో కలుపు నివారణ సాధ్యంకాదు. దీనిని బీజీ–3 పత్తికి వేస్తే, పక్కనున్న ఇతర పంటలపైనా ప్రభావం చూపుతుంది. అవీ విషపూరితమవుతాయి. బీజీ–3 విక్రయాలు రహస్యంగానైనా అమ్ముడుకాకుండా చూడాలంటే గ్లైపోసెట్ నిషేధమే సరైన పద్ధతిగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తేనే బీజీ–3పై ఉక్కుపాదం మోపడానికి వీలవుతుందని అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ముంచుకొస్తున్న గ్లైఫొసేట్ ముప్పు!
నేలతల్లికి ఎప్పుడూ లేని కష్టం వచ్చిపడింది. ఎక్కడో అమెరికాలోనే, బ్రెజిల్‌లోనో, అర్జెంటీనాలోనో కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కలుపు నిర్మూలన మందు వల్ల భూమి ఆరోగ్యానికి, పర్యావరణానికి, మనుషులు, పశువుల ఆరోగ్యానికి పెనుముప్పు వచ్చి పడింది.. ఆ పెనుముప్పు పేరే.. కలుపు మందు.. గ్లైఫొసేట్! దీన్ని పిచికారీ చేస్తే ఎంత పచ్చగా ఉన్న మొక్కయినా నిలువునా మాడి మసై పోతుంది. చట్ట ప్రకారం అయితే.. తేయాకు తోటల్లో తప్ప మరే పంట లేదా తోటలోనూ గ్లైఫొసేట్ కలుపు మందును వాడకూడదు. అటువంటిది, ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 15 లక్షల ఎకరాల్లో ఈ కలుపు మందును వాడుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 అనే జన్యుమార్పిడి పత్తిని తెలిసో తెలియకో నాటిన రైతులంతా గ్లైఫొసేట్‌ను తమ పొలాల్లో పిచికారీ చేస్తున్నారు. ఈ రకం పత్తి మొక్కపై గ్లైఫొసేట్ చల్లినా అది చనిపోకుండా ఉండేలా, కేవలం కలుపు మొక్కలన్నీ మాడిపోయేలా (ఈ అమెరికన్ హైబ్రిడ్ పత్తి రకానికి) జన్యుమార్పిడి చేశారని సమాచారం. తల్లి పాలల్లోనూ అవశేషాలు.. గ్లైఫొసేట్ అత్యంత ప్రమాదకరమైన కటిక విష రసాయనం. ఇది కేన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల నాడే ప్రకటించింది. దీన్ని పంట పొలాల్లో పిచికారీ చేయటమే కారణం. అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల్లో విచ్చలవిడిగా దీన్ని తట్టుకునే పత్తి తదితర జన్యుమార్పిడి పంటలు సాగవుతున్నాయి. ఫలితంగా అక్కడి భూములు, భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. చివరికి తల్లి పాలల్లోనూ, మనుషుల మూత్రంలోనూ గ్లైఫొసేట్ అవశేషాలు ఉన్నాయని తేలింది. కలుపు మందు చల్లితే భూమికి ఏమవుతుంది? పంట భూమి (అది మాగాణి అయినా, మెట్ట/చల్క భూమి అయినా సరే) ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆ మట్టిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉండాలి. అప్పుడే నేల సజీవంగా, స్వయం సమృద్ధంగా ఉంటుంది. చెంచాడు మట్టిలో ఈ భూతలంపై మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. ఇలాంటి పొలంలో కలుపు మందును చల్లితే ఆ భూమిపైన కలుపు మొక్కలతోపాటు భూమి లోపలి సూక్ష్మజీవరాశి, వానపాములు కూడా పూర్తిగా నశిస్తాయి. నిర్జీవంగా మారిన నేల గట్టిపడి చట్టుబండవుతుంది. నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కలుపు మందుల వాడకం ఎక్కువ కావడం వల్ల రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజానీకం ఆరోగ్యం మరింత ప్రమాదంలో చిక్కుకుంటాయి. జగమొండి కలుపు మొక్కలు! కలుపు మొక్కల నిర్మూలనకు గ్లైఫొసేట్ మందును కొన్నేళ్లు చల్లుతూ ఉంటే∙‘జగమొండి కలుపు మొక్కలు’ పుట్టుకొస్తాయి. అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా.. తదితర దేశాల్లో ఇదే జరిగింది. తోటకూర వంటి సాధారణ జాతుల మొక్కలు కూడా గ్లైఫొసేట్ దెబ్బకు మొండి కలుపు చెట్లుగా అవతారం ఎత్తాయి. అమెరికాలోని సుమారు 6 కోట్ల ఎకరాల్లో వీటి బెడద తీవ్రంగా ఉందని యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్(యు.సి.ఎస్.) నివేదిక తెలిపింది. ఎంత తీవ్రమైన కలుపు మందులు చల్లినా ఈ కలుపు మొక్కలు చావకపోగా, ఆరేడు అడుగుల ఎత్తు పెరుగుతుండటంతో అక్కడి రైతులు సతమతమవుతున్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కలుపు మందులు కనిపెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విషమిస్తున్నాయే తప్ప మెరుగవ్వటం లేదని యు.సి.ఎస్. శాస్త్రవేత్తలు తెలిపారు. కలుపు నిర్మూలనకు పైపాటు దుక్కికి అయ్యే ఖర్చులు గ్లైఫొసేట్ వల్ల తొలి దశలో తగ్గినప్పటికీ.. క్రమంగా జగమొండి కలుపుల బెడద ఎక్కువ అవుతున్నదని వారు తెలిపారు. గ్లైఫొసేట్ కలుపు మందును తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలను, ఏళ్ల తరబడి ఏక పంటలుగా విస్తారంగా సాగు చేస్తుండటమే ఈ ఉపద్రవానికి మూలకారణమని శాస్త్రవేత్తలు తేల్చటం విశేషం. అమెరికా తదితర దేశాల పొలాల్లో గ్లైఫొసేట్ కలిగించిన పెనునష్టం మన పాలకులకు, రైతులకు కనువిప్పు కావాలి. భూములు నాశనమవుతాయి.. కలుపు మందును తట్టుకునే బీజీ–3 రకం పత్తి పంటకు మన దేశంలో ప్రభుత్వ అనుమతి లేదు. గ్లైఫొసేట్ అత్యంత ప్రమాదకరమైన కలుపు మందు. పంట భూములు నాశనమవుతాయి. భూముల్లో సూక్ష్మజీవరాశి, వానపాములు, జీవవైవిధ్యం నశిస్తుంది. మన దేశంలో తేయాకు తోటల్లో తప్ప మరే పంటలోనైనా దీన్ని వాడటం నిషిద్ధం. పత్తి సాగు విస్తీర్ణంలో ఈ ఏడాది 20% వరకు బీజీ–3 రకం పత్తిని అక్రమంగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కన్నుగప్పి విత్తనాలమ్మిన వారు, సాగు చేస్తున్నవారు, విత్తనాలు సేకరించి నిల్వచేసే వారు.. అందరూ నేరస్థులే. గ్లైఫొసేట్‌ను తట్టుకునే జన్యుమార్పిడి పంటలను అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల్లో సాగు చేస్తున్నారు. అక్కడ మొండి కలుపు మొక్కలు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. మన దగ్గర రైతులకు సంతోషం ఒకటి, రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం నిలవదు. దీర్ఘకాలంలో పర్యావరణం దెబ్బతింటుంది. ఇది కేన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. సీఐసీఆర్ పత్తి హైబ్రిడ్లే ప్రత్యామ్నాయం. – డా. కేశవులు, డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ సంస్థ, హైదరాబాద్ -
సులభంగా కలుపు తీసేద్దాం
కొన్ని రకాల కలుపు మందులు విత్తనం వేసిన వెంటనే గానీ, మొలకెత్తక ముందు గానీ పిచికారీ చేయాలి. ఉదాహరణకు పెండిమిథాలిన్, అల్లాకోర్ మొదలైనవి. ఈ రకం మందులను స్ప్రే చేసే సమయంలో నేలలో తగినంత తేమ ఉంటే బాగా పనిచేస్తాయి. కొన్ని రకాల కలుపు మందులు పైరు, కలుపు మొలకెత్తిన తర్వాత తర్వాతనే పిచికారీ చేయాల్సి ఉంటుం ది. ఇమాజతాఫైర్, ఫినాక్సాప్రాప్, పి ఇథైల్ ఈ కోవలోకి చెందినవి. ఈ మందులను వేరుశనగ, మినుము, పెసర పైర్లు విత్తిన 15-20రోజుల తర్వాత పిచికారీ చేయాలి. అప్పటికీ కలుపు మొలిచి ఉంటుంది. పైరు విత్తిన వెంటనే వీటిని స్ప్రే చేస్తే ఉపయోగం ఉండదు. కలుపు మందులను తేలికపాటి (ఇసుక, గరప) నేలల్లో తక్కువ మోతాదులోనూ, నల్లరేగడి భూముల్లో ఎక్కువ మోతాదులో, ఎర్ర నేలల్లో మధ్యస్తంగా వాడుకోవాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కలుపు మందులను పిచికారీ చేయొద్దు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్ప్రే చేయడం తప్పదు. సాధ్యమైనంతవరకు రైతులు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ పర్యావరణ పరిరక్షణతోపాటు అధిక దిగుబడులను సాధించవచ్చు. కలుపు మొక్కలు... బంగారుతీగ(మినుము మరియా లూసర్న్ గడ్డి): దీని నివారణకు లీటరు నీటిలో 5 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ (స్టాంప్, పెండిగార్డ్, పెండిస్టార్)ను విత్తనం వేసిన 48 గంటలోలపు పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో 1.5మిల్లీలీటర్ల ఇమాజతాఫైర్ (పర్స్యూట్, ధీనామజ్, లగాన్) మందును కలిపి విత్తనం వేసిన 15-20 రోజుల మధ్యలో పిచికారీ చేయాలి. జొన్నమల్లె... దీని నివారణకు 5నుంచి 7గ్రాముల 2, 4-డి సోడియం ఉప్పు(ఫెర్నాక్సోన్, సాలిక్స్) మందును కలిపి జొన్నమల్లెపై పడేలా పిచికారి చేయాలి. తుంగ లాంటి మొండి జాతి కలుపు మొక్కలు... భూమిని దున్నక ముందు గానీ, లేదా మొదటి పంట తర్వాత రెండో పంట వేయకముందు చేపట్టాల్సిన పద్ధతులు.. తుంగ మరియ ఇతర కలుపును 15-20 రోజుల వరకు పెరగనీయాలి. అవసరమైతే నీటిని పారబెట్టి త్వరగా పెరిగెలాచేయాలి. కలుపు బాగా పెరిగిన తర్వాత లీటరు నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫోసేట్ మందును కలిపి స్ప్రేచేయాలి. 10-15రోజులు ఆగి కలుపు చనిపోయిన తర్వాత దున్నితే తుంగను కొంతవరకు నివారించవచ్చు. ఈ విధంగా మూడుసార్లు చేస్తే తుంగ మొదలగు మొండి కలుపు తగ్గుముఖం పడుతుంది.