‘ఎడ్యుకేషన్’ పోస్టుల భర్తీలో అక్రమాలు | 'Education' posts, recruitment irregularities | Sakshi
Sakshi News home page

‘ఎడ్యుకేషన్’ పోస్టుల భర్తీలో అక్రమాలు

Published Wed, Feb 18 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

‘ఎడ్యుకేషన్’ పోస్టుల భర్తీలో  అక్రమాలు

‘ఎడ్యుకేషన్’ పోస్టుల భర్తీలో అక్రమాలు

కొన్ని చోట్ల అనర్హులను ఎంపిక చేసి పంపిన కమిటీలు
తొలగించే పనిలో అధికారులు ఫిర్యాదులపై విచారణ షురూ

 
 విద్యారణ్యపురి :  తెలంగాణ సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) జిల్లా ప్రాజెక్టు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధించేం దుకు అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. సర్టిఫికెట్లతో పని లేకుండా పైరవీల కు, అమ్యామ్యాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు వి మర్శలు వస్తున్నారుు. ఇదే విషయమై పలువురు అభ్యర్థులు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టడంతో అక్రమాలు వెలుగు చూస్తున్నారుు. జిల్లాలో ఖాళీగా ఉన్న వర్క్ ఎడ్యుకేషన్ - 133, ఆర్ట్ ఎడ్యుకేషన్- 65, ఫిజికల్ ఎడ్యుకేషన్ - 15 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. టీటీసీ(టీచర్ టెక్నికల్ సర్టిఫికెట్) హయ్యర్‌లో ఉత్తీర్ణత సాధించడం అర్హతగా ప్రకటించారు. అభ్యర్థులకు నెలకు రూ.6 వేల వేతనం ఇవ్వాలని నిర్ణరుుంచారు.

ఈ మేరకు పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఆయూ హెచ్‌ఎంలే ఈ దరఖాస్తులు స్వీకరించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, హెచ్‌ఎం, స్కూల్ కాంప్లెక్స్ బాధ్యులు కమిటీగా ఏర్పడి ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి గత నెలలోనే సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారులకు పంపారు. అరుుతే ఎంపిక చేసిన అభ్యర్థుల్లో కొందరు అనర్హులు కూడా ఉన్నట్లు అధికారుల సర్టిఫికెట్ల పరిశీలనలో వెల్లడైంది. కొందరు అభ్యర్థులు టీటీసీ లోయర్ సర్టిఫికెట్లను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ వారిని పలుచోట్ల వివిధ పాఠశాలల కమిటీలు ఎంపిక చేసి పంపారు. ఆయా పోస్టులకు విద్యార్హతల మార్గదర్శకాలను ముందే జారీ చేసినప్పటికీ తమ ఇష్టానుసారంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు తమతమ పాఠశాలల పరిధిలో కమిటీలపై ఒత్తిడి చేసి ఎంపిక చేయించుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

 ఈ క్రమంలోనే అన్యా యం జరిగిన అభ్యర్థులు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌సెల్‌లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ప్రాజెక్టు అధికారులు ఐదుగురు ఉద్యోగులతో విచారణ జరిపిస్తున్నారు. అనర్హులను ఎంపిక చేసిన పాఠశాలలకు వెళ్లి అక్కడ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తి చేసి తుది జాబితా ఎప్పుడు వెల్లడిస్తారోనని అభ్యర్థులు వేచి చూస్తున్నారు.
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement