ఈ సందర్భంగా ఆమె స్వయంగా వాహనంలో డీజిల్ పోసుకుని డబ్బులు చెల్లించారు. అనంతరం బెటాలియ ప్రధాన గేటు సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డిలు ప్రారంభిచారు. అలా గే ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన బెటాలియన్ పేరుగల బోర్డును, ట్రైనింగ్‌సెంటర్ సమీపంలో ఇటీవల నిర్మించిన రెండు ప్రీ–ఫ్యాబ్రికేటెడ్ బ్యారక్స్‌ను, 25 వాష్ రూమ్స్‌ను ప్రారంభించారు. బెటాలియన్‌లో సెట్విన్ ఆధ్వర్యంలో ఔత్సాహిక మహిళలు, యువతులకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఐజీ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నా రు.
కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు, 4వ బెటాలియన్ ఇన్‌చార్జి కమాండెంట్ ఎంఎస్‌కుమార్, 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సాంబయ్య, అసిస్టెంట్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఏసీపీ ఆనంద్‌కుమార్, ఆర్‌ఐ కృష్ణ, ఐవోసీఎల్ తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ రమణరావు, వరంగల్ డివిజన్ ఎస్‌డీఆర్‌యం ప్రియభారత సాహూ, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
దర్బార్ పరేడ్ ... బెటాలియన్‌లోని ట్రైనింగ్‌సెంటర్, యూనిట్ హాస్పిటల్, వెల్ఫేర్ సెంటర్, ప్రధాన కార్యాలయాన్ని ఐజీ సందర్శించారు. అనంతరం బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో దర్బార్ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. దర్బార్ పరేడ్‌కు ఇంతమంది బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో హాజరు కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో బెటాలియన్స్ పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు.