మాట్లాడుతున్న కలెక్టర్, పక్కన జేసీ
సాక్షి, హన్మకొండ అర్బన్: లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయం గరిష్టంగా రూ.70 లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ణయించిందని కలెక్టర్, వరంగల్ పార్లమెంట్ ఆర్‌ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్నికల బృందాలతో నిర్వహించిన సమీక్ష సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. శాఖాపరమైన పనుల పేరుతో ఎన్నికల విధులు విస్మరిస్తే సహించేదిలేదని, అలాంటి వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
సస్పెన్షన్‌కు గురైన వారు తిరిగి విధుల్లో చేరడం కష్టమని చెప్పారు. సమయ వ్యయ పరిశీలకుల సమన్వయంతో అధికారులు పనిచేయాలని సూచించారు. జేసీ దయానంద్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రచార సామగ్రి ధరలు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ప్రచారం విషయంలో నిఘా బృందాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశం వీడియో చిత్రీకరించి ప్రచార ఖర్చుల నివేదికలు ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్‌ఓకు సమర్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment